టివీ రేటింగ్స్ పెంచుతున్న `గర్భాలు’

హిందీ టివీ సీరియల్స్ టిఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం తెగ తాపత్రయపడిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు పెళ్ళితంతు, ఆచారవ్యవహారాలపై సుదీర్ఘ సీరియల్స్ తీసేసిన హిందీ ఛానెళ్లు ఇప్పుడు గర్భవతుల చుట్టూ కధలు అల్లుతున్నాయి. `మే మా బనేవాలీహూన్’ అన్న డైలాగ్ ఇప్పుడు హిందీ సీరియల్స్ లో మోతపుట్టిస్తోంది. ప్రెగెన్సీ చుట్టూ అల్లే కథలు మహిళా ఆధరణకు నోచుకుంటున్నాయనీ, దీంతో టివీ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్ బాగా పెరుగుతున్నాయని యాజమాన్యాలు గుర్తించాయి. దీంతో ప్రెగెన్సీ చుట్టూ డ్రామాలు అల్లుకుపోతున్నాయి. ఒక ఇంట్లో కోడలు గర్భవతి అయిందని తెలియగానే ఆ ఇంట్లో సభ్యుల ఆనందాలు, ప్రేమానురాగాల చుట్టూ కథలు అల్లుకుపోతున్నాయి. ఉత్తరాన్ లో తమస్య గర్భం…ప్రతిగ్యలో కేసార్ ప్రెగెన్సీ…పవిత్ర రిష్టలో అర్చన…ఇలా ఏదో ఒక సీరియల్ లో గర్భం ఓ హాట్ టాపిక్ అయిపోయింది. యే రిస్టా క్యా కెహల్తాహై సీరియల్ లో అక్షర గర్భవతి అయిందా లేదా అన్నది స్టోరీలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అలాగే, బాబా అయిసో వార్ దూండో సీరియల్ లో భారతి త్వరలో గర్భవతి కాబోతున్నది. అసలు గర్భవతిలు అవుతారో…అంతలో గర్భం ఏమీ లేదని తేలుస్తారన్నది స్క్పిప్ట్ రైటర్స్ ఇష్టం. పీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటే పెరుగుతుందో ఆలోచించి, ఆ విధింగా కథను మోల్డ్ చేస్తున్నారు. ఇలాంటి గర్భం డ్రామాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారని సర్వేలు చెబుతుండటంతో హిందీ ఛానెళ్లు పనిగట్టుకుని కథలో ఇలాంటి మలుపులు తిప్పుతున్నాయి. ప్రెగెన్సీ లోనే లవ్, రోమాన్స్…సెంటిమెంట్స్…ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉండటంతో ఈ మసాలా ఏదో హిందీ ఛానెళ్లకు బాగానే అచ్చివచ్చినట్టుంది. మరి తెలుగు సీరియల్స్ లో ఈ సక్సెస్ ఫార్ములా ఎప్పుడొస్తుందో…
- శ్రీదేవి (హైదరాబాద్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!