ప్ర‌ళ‌యంలోనూ సుర‌క్షితంగా ఉండాలంటే…?

భూ ప్ర‌ళ‌యం వ‌స్తుంద‌ని.. భూమి అంత‌రించిపోతుంది.. భూమిపై ఉన్న అనంత జీవ‌కోటికి నూక‌లు చెల్లిపోయాయ‌ని.. ఇలా ఎన్నో ఎన్నెన్నో క‌థ‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.. ఈ ప్ర‌ళ‌యానికి సంబంధించిన ప్ర‌త్యేక క‌థ‌నాలు ఇప్పుడున్న ఎల‌క్ట్రానికి మీడియాలో ప్ర‌తి రోజూ వ‌స్తూనేఉంటాయి. ఒక ద‌శ‌లో ఈ ప్ర‌ళ‌యాల‌కి సంబంధించిన న్యూస్ హాట్ న్యూస్‌గా, హాట్ టాపిక్‌గా కూడా అవుతుంది. మే 21న అన‌గా రేపు.. రేపే భూ ప్ర‌ళ‌యం రాబోతుంద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. అంతే కాదు 2012లో మాత్రం ఖ‌చ్చితంగా ప్ర‌ళ‌యం రాబోతుందని మ‌రొక వాద‌న‌.. 2035లో భూమి మొత్తం నాశ‌నం అయిపోతుంద‌ని.. భూమిపై జీవ‌రాశులు అంత‌ర్ధాన‌మైపోతాయ‌ని మ‌రొక వాద‌న‌.. ఈ వాద‌న‌ల‌న్నీ ఎలా వున్నా.. ఒక‌వేళ భూ ప్ర‌ళ‌యం గ‌న‌క నిజంగానే వ‌స్తే… మ‌నుషులు ఏం చేయాలి.. భూ ప్ర‌ళ‌యం భారినుండి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి..?  భూ ప్ర‌ళ‌యంలోనూ సుర‌క్షితంగా ఉండాలంటే ఎలా..? అనే ప్ర‌శ్న‌లు మీలో ఉద‌యిస్తున్నాయి క‌దూ.. ఉంది.. భూ ప్ర‌ళ‌యం నుండి మ‌న‌ల్ని మ‌న కాపాడుకోవాలంటే.. ఓ చోటు ఉంది.. ఆ చోటుకి వెళితే భూ ప్ర‌ళ‌యం నుండి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చు.. ఇది క‌ల్పింతం కాదండోయ్‌.. నిజ‌మే.. భూ ప్ర‌ళ‌యం నుండి సుర‌క్షితంగా ఉండాలంటే.. వెంట‌నే క‌ర్ణాట‌క రాష్ట్రం వెళ్ళాల్సిందే.. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని క‌ల‌హ‌ళ్ళిలో ఓ ప‌విత్ర‌మైన ఆల‌యం ఉంది.. ఆ ఆల‌యం పేరు ప్ర‌ళ‌య వ‌రాహ‌నాథ ఆల‌యం.. ఇది వ‌రాహ‌స్వామి ఆల‌యం.. భూ ప్ర‌ళ‌యాన్ని అరిక‌ట్టే దేవుళ్ళు ఎవ‌రైనా ఉన్నారా అంటే.. అది ఒక్క ఆ వ‌రాహ‌స్వామికే సాధ్యం.. ఈ ఆల‌యం చుట్టు ప‌క్క‌ల ఎన్నో సార్లు ఎన్నో వ‌ర‌ద‌లు వ‌చ్చాయి.. ఆ వ‌ర‌ద‌ల్లో ఈ ఆల‌యం చుట్టు ప‌క్క‌ల ఉన్న ఊళ్ళు, పోలాలు అన్నీ కొట్టుకుపోయినా ఈ ఆల‌యం మాత్రం చెక్కు చెద‌ర‌లేదు.. దాదాపు 2,500 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన ఈ ఆల‌యం ఖ‌చ్చితంగా ప్ర‌ళ‌యాన్ని అరిక‌ట్టే ఆల‌యం గా భావిస్తారు. నిజంగానే ప్ర‌ళ‌యం గ‌నుక వ‌స్తే.. ఈ ఆల‌యంలోకి వెళ్ళి ప్ర‌ళ‌యం భారి నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!