అది ఎంత ఘాటుగా ఉంటుందో
పాతసినిమా కథా రచయితలు ఊహించి రాస్తే చూసిన ప్రేక్షకులు నవ్వుకున్నారు. కానీ అతి త్వరలో అది నిజం కాబోతున్నది. పనివాళ్లు సంఘాలు, సమ్మెలేకాదు…వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి… రోజు కూలీ కింద కనీసం 115 రూపాయలు చెల్లించాలి… (నూట పదహార్లయితే భారతీయ సాంప్రదాయం ప్రకారం మరింత గౌరవ ప్రదంగా ఉంటుందన్న వారూ ఉన్నారు) ఏడాదికి కనీసం 15 రోజుల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ప్రసూతి సెలవువలతోపాటుగా, అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించే అన్ని సదుపాయాలు పనిమనుషులకు కూడా వర్తింపజేయాలి. పనివాళ్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర కార్మికశాఖల్లో వారి పేర్లు నమోదు అయ్యేలా చూడాలి. కార్మిక సంఘాలను స్థాపించుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి.
ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు… జాతీయ సలహా మండలి (ఎన్ఎసీ) చైర్ పర్సన్ కూడా అయిన సోనియా గాంధీ చెప్పిన మాటలు. కేవలం మాటల్లోనేకాదు, ఈ మేరకు ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ కూడా రాశారు. పది రోజుల కిందటే ఆ లేఖ తమకు అందిందనీ, దీని విషయంపై ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నామని కార్మికశాఖ కార్యదర్శి పి.చతుర్వేది ఢిల్లీలో చెప్పారు. అంటే పనిమనుషులకు మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. వీరి విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక జాతీయ విధానాన్ని రూపొందించబోతున్నది.
-ఢిల్లీ ప్రతినిధి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి