పోకిరీతో కాజల్
ఈమధ్య కాజల్ దూసుకుపోతున్నది. టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సరసన ఆటపాటలతో చిందులువేస్తూ హుషారుగా కెరీర్ ని మోల్డ్ చేసుకుంటోంది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సరసన నటించబోతున్నది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తీయబోతున్నది బిజినెస్ మెన్ చిత్రంలో కాజల్ ని పూరీ సెలెక్ట్ చేశారు. ఈ విషయం పూరీనే స్వయంగా మీడియాకు చెప్పేశారు. జులైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. పూరీ దర్శకత్వంలోనే గతంలో మహేష్ `పోకిరీ’ మెగా హిట్ కొట్టింది. కొత్త చిత్రాలనికి నిర్మాతగా ఉన్న వెంకట్ కథ వెనగానే ఎగిరిగంతేసి మరో పోకిరీ ఖాయమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
- మువీ ప్రతినిధి (హైదరాబద్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి