లేడీస్ కు 50శాతం రిజర్వేషన్లు-కిరణ్ ఘనత

స్థానిక సంస్థలలో ఏభై శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో స్థానిక రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కృషి చేస్తున్నట్లుగా ఉంది. ఆయన కొంతకాలం క్రితం ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ ఎన్నికలలో అమలలుకుగాను ఈ రిజర్వేషన్ల జీవో ఇచ్చారు. .మున్సిపల్ ఎన్నికలలో మహిళలకు ఏభై శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.దీంతో మొత్తం 108 ముస్సిపాలిటీలలో సగం ఏబైనాలుగు మున్సిపాల్టీలు పద్దెనిమిది కార్పోరేషన్లకు గాను తొమ్మిది మహిళలకు రిజర్వు అవుతాయి.అలాగే వార్డులకు కూడా ఇదే రిజర్వేషన్ శాతం వర్తిస్తే వేలాదిమంది మహిళా కౌన్సిలర్లు వస్తారు. ఇది ఒకరకంగా విప్లవాత్మక నిర్ణయమే అవుతుంది.చట్టసభలలో ముప్పైమూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించాలన్న డిమాండు ఎప్పటినుంచో పెండింగులో ఉంది.పార్లమెంటులో ఎప్పటికప్పడు మహిళాబిల్లు పెట్టాలని ఆలోచించడం , వివిధ కారణాలవల్ల వెనుకబడి పోవడం జరుగుతోంది. అలాంటి దశలో మున్సిపాల్టీలలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. తద్వారా తాను చేసిన హామీని నిలబెట్టుకున్నానన్నపేరును కిరణ్ తెచ్చుకున్నట్లయింది.మహిళలలో కొత్త నాయకత్వం రావడానికి ఇది అవకాశం కలిగిస్తుంది.అయితే కొన్నాళ్లపాటు మహిళలకు పదవులు వచ్చినా పరోక్షంగా వారి కుటుంబ సభ్యులే పెత్తనం చేసే అవకాశం ఉంది.అయినప్పటికీ ఇది ఒక ప్రారంభంగా భావించవచ్చు.పురుషాధిక్యత సమాజంలో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుంది.అయితే పురుష నేతలకు అవకాశాలు తగ్గిపోతాయన్న ఆందోళన ఉంటుంది. మహిళలు చురుకుగా లేకపోతే నష్టం జరుగుతుందన్న భావన ఉన్నప్పటికీ, సమాజంలో ఎప్పటికప్పుడు ముందుకు సాగాల్సిందే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!