కాకాకు గుండెపోటు…!

ప్ర‌ముఖ రాజ‌కీయ వేత్త‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు గ‌డ్డం వెంక‌ట‌స్వామి అలియాస్ కాకా గుండెపోటుతో కొద్ది స‌మ‌యం క్రితం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, అత్య‌వ‌స‌ర చికిత్సని అందిస్తున్నామ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అక్టోబ‌ర్ 5, 1929లో జ‌న్మించిన వెంక‌ట‌స్వామి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌ని వేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. 14 సార్లు లోక్‌స‌భ‌కి ఎన్నికైన ఘ‌న‌త ఆయ‌న‌ది. అంతేకాదు కార్మిక, టెక్స్‌టైల్ శాఖల‌కి ఆయ‌న ప‌లు ద‌ఫాలుగా రాష్ట్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న కుమారుడ జి. వినోద్ ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఎం.పిగా కొన‌సాగుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!