
ప్రత్యేక తెలంగాణ కోసం పదేళ్ళనుండి టి.ఆర్.ఎస్. పార్టీ ఉద్యమం కొనసాగిస్తుండడం తెలిసిందే.. వైఎస్. రాజశేఖరరెడ్డి మృతి తర్వాత ఈ తెలంగాణ ఉద్యమాన్ని కె.సి.ఆర్. తనదైన శైలిలో ప్రజలలోకి తీసుకెళ్ళి ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చడానికి టీఆర్ఎస్ సక్సెసయ్యింది. ఈ సందర్భంగా కేసిఆర్ ఆమరణదీక్ష చేయడంతో ఒక దశలో కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తానని కూడా ప్రకటించేసింది. ఇక అప్పటినుండి సమైక్య, ప్రత్యేక తెలంగాణ అంటూ ఉద్యమాలు ఉవ్వెత్తున ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా వేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికని కేంద్రానికి సమర్పించింది. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉండడంతో ఈ విషయం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆవశ్యకత ఏర్పడింది.. తాజాగా ఉత్తర ప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ రెండో ఎస్సార్సీ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో తెలంగాణ విషయంలోనూ అధిష్టానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉందన్నది స్పష్టమయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేలా లేదని తెలంగాణ వాదులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ రెండో ఎస్సార్సీ నిర్ణయం తీసుకున్నప్పటికీ టిఆర్ఎస్ నుండి స్పందన రాకపోవటంతో విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా చిన్న విషయానికి కేసీఆర్ రచ్చ రచ్చ చేస్తూంటారు. మరి కేంద్ర ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయన సైలెంటుగా ఉండటం వెనుక ఏదైనా వ్యూహం వుందా..? తెలంగాణ రాష్ట్రం కోసం మరింకేమైనా ఉద్యమాలకి శ్రీకారం చుట్టబోతున్నారా.. రెండో ఎస్సార్సీ నిర్ణయాన్ని కేంద్ర వెనక్కి తీసుకునేలా చేయడం కోసం మళ్ళీ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళడానికి పావులు కదుపుతున్నాడా..? అని తెలియాలంటే.. జస్ట్ వెయిట్ అండ్ సీ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి