వేద పాఠశాలలో లైంగిక వేధింపులా!

తిరుమల వేద పాఠశాలలో లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. తిరుమలను పవిత్రంగా పరిగణిస్తారు. అక్కడ కొండలలో వేద పాఠశాలను నడుస్తోంది. కాని ఎప్పటి నుంచి ఈ కంప్లయింట్ లు ఉన్నాయోకాని అవి ఇప్పుడు బయటపడ్డాయి.సీనియర్ విద్యార్ధులు జూనియర్ విద్యార్దులను లైంగికంగా వేధిస్తున్నారన్నవి ఆరోపణ. కొందరు తల్లిదండ్రులు ఈ విషయాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఐ వై ఆర్ కృష్ణారావు దృష్టికి తీసుకు వెళ్లారు.దానిపై ఆయన స్పందించినప్పటికీ, దానిని గోప్యంగా ఉంచారు. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అలా ఉంచామని విజిలెన్స్ దర్యాప్తను కూడా ఆదేశించామని ఆయన చెప్పారు.దీని ఫలితంగా వచ్చే ఏడాది నుంచి వేద పాఠశాలలో అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లైంగిక వేధింపులనేవి ఎక్కడైనా, ఎలాగైనా జరగవచ్చని తేలుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!