కనిమొళి జైలు గదిలో తలుపులేని టాయిలెట్ (ప్రత్యేక కథనం)

కాలం బహుచిత్రమైనది. రాజాలా బతికినవాడ్ని ఉన్నట్టుండి నిరుపేదగా మార్చేస్తుంది కాలం. లక్షలకోట్లాధికారినంటూ విర్రవీగిన వాడ్ని ఉన్నట్టుండి భిక్షాధికారిని చేసేస్తోంది కాలం. 2జి కుంభకోణంలో చిక్కుకుని తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తున్న కనిమొళికి నిన్నటిదాకా దోమలబాధ తెలియదు. అసలు కటికనేలపై పడుకోవాల్సి వస్తుందని కూడా అనుకుని ఉండదు. ఎందుకంటే, కనిమొళి అంటే ఎవరు…? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె. కరుణానిధి రాజకీయలక్షణాలేకాకుండా, ఆయనలోని రచయిత లక్షణాలను, కవిని కూడా వారసత్వంగా అందిపుచ్చుకున్నది కనిమొళి. అందుకే కరుణానిధికి తన కుమార్తె కనిమొళి అంటే అపరమితమైన బాగా ఇష్టం. లంకంత కొంపలో యువరాణిలా వెలుగొందిన కనిమొళికి 2జి స్ప్రెక్టమ్ కుంభకోణం కష్టాలు తెచ్చిపెట్టింది. సరిగా అదే సమయంలో ఎన్నికల్లో కరుణానిధితో సహా డిఎంకె తుడిచిపెట్టుకుపోవడంతో తమిళనాట జయలలిత రాజ్యం స్థాపితమైంది. ఆ వెంటనే కనిమొళి అరెస్టు జరిగిపోయింది. తీహార్ జైలుకు తరలించడం కూడా యమ స్పీడ్ గా సాగిపోయింది. ఇప్పుడు తీహార్ జైల్ సెల్ లో కనిమొళి పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుందామని జైలు అధికారులతో ఈ ప్రతినిధి ప్రయత్నించినప్పుడు ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
1. కటిక నేలపై పడుకోవాల్సి వస్తున్నది. 10×15 అడుగుల విస్తీర్ణం ఉన్న సెల్ లోనే ఆమె ఇక కనీసం కొన్ని వారాలు పడుకోవాల్సి ఉంటుంది. 2. శుక్రవారం (20-05-11) తొలిసారిగా తీహార్ జైల్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఆరెంజ్ కలర్ సర్వార్ సూట్ ధరించిఉంది. 3. జైలు గదికి ఒక టివీ కొన్ని వార్తాపత్రికలు ఇచ్చే అవకాశం ఉంది. 4. ఆమె పక్కసెల్ లో ఉంటున్న వారు… గూఢచర్యం చేసిందన్న ఆరోపణపై అరెస్టయిన మాధురి గుప్తా, రెండో వ్యక్తి – సోనూ పుంజబాన్. 5. జైలు గదిలో ఎటాచ్డ్ టాయిలెట్ ఉంది. కానీ దానికి తలుపులు లేవు. కర్టెన్ మాత్రమే ఉంది. 6. జైలు గదిలో ఒక ఫ్యాన్ ఉంది. 7. గదిలో దోమలు బాగానే ఉన్నాయి. దీంతో కనిమొళికి శుక్రవారం రాత్రి నిద్రపట్టలేదు. ఇప్పుడు ఆమెకు దోమలను ఎలా వదిలించుకోవాలా అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. మస్కిటో కాయిల్స్ ఇవ్వమని ఆమె జైలు అధికారులను కోరింది. 8. ఆహారం: సౌత్ ఇండియన్ ఫుడ్. ఇడ్లీ, వడ, సాంబార్ వంటివి తినడానికి వీలుంటుంది. శుక్రవారం రాత్రి మాత్రం డిన్నర్ క్రింద చపాతీ, రైస్, సుబ్జీ, దాల్ తీసుకుంది. 9. మందులు, పుస్తకాలు, కళ్లజోడు వంటివి లోపలకు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. 10. ముక్కుపుడుకతో సహా ఎలాంటి ఆభరణాలు ధరించడానికి వీల్లేదు. జైలుకు వచ్చే బంధువులను వారానికి రెండుసార్లు చూసే అవకాశం ఉంటుంది.
- భూషణ్ (న్యూఢిల్లీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!