తెలంగాణపై జగన్ ఎఫెక్ట్
తెలంగాణ లో జగన్ ఎఫెక్ట్ పడుతున్నట్లుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ విదేయులపై వేటు వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లాను ఇందుకు ఎంపిక చేసుకున్నట్లున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడు ఇంద్రకిర్ రెడ్డి ప్రత్యర్దులైన నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి సంకేతాలు పంపించారు.దీనిపై ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడుతున్నారు.తనకు తెలియకుండా ఇద్దరు మంత్రులను ఆదిలాబాద్ జిల్లాకు పంపడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కోమటిరెడ్డికి కూడా చెక్ పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు ఉన్నారు. కోమటిరెడ్డి కూడా జగన్ తో సంబందాలు ఉన్నాయన్న అనుమానం ముఖ్యమంత్రికి ఉంది.అంతేకాక కోమటిరెడ్డి బంధువు కూడా అయిన ఇంద్రకిరణ్ రెడ్డి స్వయంగా జగన్ ను కలిసివచ్చారు ఈ నేపధ్యంలో జగన్ వర్గాన్ని అదుపు చేయాలని ఇప్పటికే పార్టీలోని ఒక వర్గం డిమాండు చేస్తుండడంతో కిరణ్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు.కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీదర్ బాబు, నిజామాబాద్ జిల్లా కు చెందిన మంత్రి సుదర్శనరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిజానికి మహేష్ రెడ్డి గతంలో జగన్ కు సన్నిహితంగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ నాయకత్వానికి సన్నిహితమయ్యారు. అదికార పార్టీలో ఉంటేనే అధికారులుకాని, ఇతరత్రా కాని పనులు జరుగుతాయన్నభావనతో ఆయన ఇటువైపు మళ్లారు.దానికి తోడు ఇంద్రకిరణ్ రెడ్డి జగన్ ను కలవడాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. ఎక్కడోచోట జగన్ వర్గాన్ని నియంత్రించడం ఆరంభించాలని కనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విధంగా అడుగులు వేస్తున్నారు. ఇదంతా జగన్ ఎఫెక్ట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇప్పటికే జగన్ కోవర్ట్ అని నల్లగొండ జిల్లాకే చెందిన మాజీ మంత్రి , సీనియర్ నాయకుడు గోవర్దనరెడ్డి ఆరోపించారు.దీంతో మంత్రివర్గంలో జగన్ కోవర్టులంతా కొందరికి ముద్ర వేయబోతున్నారని అర్దం చేసుకోవచ్చు.కాంగ్రెస్ లో ఉంటూ జగన్ వర్గానికి అనుకూలంగా ఉంటున్నారంటున్న వారిని గుర్తించి వేటు వేయడానికి దీనిని ఒక ప్రాతిపదికగా చేసుకుంటున్నారన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి