బోనీలో శ్రీదేవికి నచ్చనిది `అదే’..
నాలుగేళ్ల ప్రాయం నుంచే వెండితరమీద నటించిన శ్రీదేవి అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అయితే వివాహం అయిన తరువాత 14ఏళ్ల నుంచి శ్రీదేవి స్క్రీన్ కు దూరంగానే ఉంటున్నది. తాను, తనభర్త బోనీ కపూర్, పిల్లలు…ఇదే శ్రీదేవి లోకం. భర్త బోనీ అంటే మిగతా విషయాలేమేకానీ, ఆయన తన ఆరోగ్యం పట్ల చాలా అశ్రద్ధగా ఉంటారనీ, అదే తనకు నచ్చనిదని శ్రీదేవి ఈ మధ్య మీడియాకు చెప్పేసింది. తాను ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటుంటే, మరో పక్క బోనీ చాలా నిర్లక్ష్యంగా ఉంటాడన్నదే శ్రీదేవి కామెంట్. వేళకు సరిగా తినకపోవడం, నిద్రపోకపోవడంతో ఈ మధ్య బోనీ ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో కూడా చేరాల్సివచ్చింది. దీంతో శ్రీదేవి తన భర్త పట్ల మరింత కేర్ తీసుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, శ్రీదేవి మరోసారి వెండితెరమీద కనబడబోతుంది. ఇందుకు రంగం సిద్ధమైంది. గౌరీషిండే దర్శకత్వంలో తీసే సినిమాలో శ్రీదేవి కీలక పాత్ర ోషించబోతున్నది. జులై చివర్లో షూటింగ్ ప్రారంభం కావచ్చు. తన పిల్లల్నిమాత్రం సినిమాల్లోకి రమ్మనమని చెప్పననీ, వాళ్ల కెరీర్ ను వాళ్రే మలచుకుంటారని శ్రీదేవి అంటున్నది.
- మువీ ప్రతినిధి (ముంబయి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి