బాబ్రీ విధ్వంసంపై ఠాక్రే కోడలి చిత్రం

శివసేన అధినాయకుడు బాల్ ఠాక్రే కోడలు స్మిత ఠాక్రే ఇప్పుడు బాబ్రీ విధ్వంసంపై సినిమాతీసేపనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం తాలూకు స్క్రిప్ట్ పూర్తయింది. మరో మూడునెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవుతుంది. ఈ సినిమాలో కీలకపాత్రకోసం అమీర్ ఖాన్ ను ట్రైచేశారు. అయితే, అమీర్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజిబిజీగా ఉండటంతో అజయ్ దేవగన్ తో స్మిత చర్చలు జరిపారు. ఈ చిత్రం కోసం ఆమె చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అమీర్ ఖాన్ తోనే ఐదారుసార్లు సమావేశమయ్యారు. స్క్రిప్ట్ విషయంలో అమీర్ సాయం చేశారు. ఇన్ పిట్స్ అందించారు. ఈ సినిమాపేరును `బాబ్రీ’గా అనుకుంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఠాక్రే ప్రమేయాన్ని సీబీఐ తిరగదోడేవిషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం శివసేన అధినేత బాల్ ఠాక్రేను తన అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశించిన రెండునెలలకు ఠాక్రే కోడలు తాను బాబ్రీ పేరిట చిత్రం తీస్తున్నట్టు ప్రకటించడం విశేషం. బాబ్రీ మసీదును 1992లో కూల్చిన తరువాత  కుట్రదారు లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.  ఇంతకీ ఈ సినిమా కూడా వివాదాస్పద మవుతుందా…? అసలు ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు? అన్న సందేహాలకు ఠాక్రే కోడలు సమాధానమిస్తూ, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను ఓ సామాన్యుడి కోణంలో ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. తన మనోభావాలను సైతం సినిమాటిక్ గా చూపిస్తామని అంటున్నారు ఠాక్రే కోడలు స్మిత. మొత్తానికి ఈ చిత్రం ఎలాంటి వేడి పుట్టిస్తుందో చూడాలి.
- కరీముద్దీన్(ముంబయి సినీ ప్రతినిధి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!