గ్రహకూటమి – అరిష్టమే (గ్రహ`భయం’- ఆఖరి భాగం)
ఖగోళంలో ఎప్పుడు ఏ వింత సంఘటన చోటుచేసుకున్నా పెనుముప్పు సంభవించబోతుందంటూ ప్రచారం హోరెత్తుతోంది. ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాలు ఊపెక్కడంతో ఎక్కడ ఏ చిన్న వదంతి మొలకెత్తినా, నిమిషాల్లో భూమిని చుట్టేస్తోంది. ఈ కారణంగానే ప్రళయం వచ్చేస్తోందంటూ పిడుగుపాటు వార్తలు మీద పడుతున్నాయి. అయితే వీటిని నమ్మవచ్చా…? ఇలా ఎందుకు ప్రచారం జరుగుతోంది…ఇప్పుడు ఆకాశంలో కనబడుతున్న గ్రహ చతుష్ఠయానికీ, ప్రళయానికీ ఏమైనా సంభందం ఉన్నదా…?
ప్రళయకాల ముహుర్తాలు……………………
2035
2012
2011
ఏమిటీ అంకెల గారడీ అనుకుంటున్నారా?
ఇవన్నీ యుగాంతం సంభవిస్తాయంటూ ప్రచారంలోకి వచ్చిన సంవత్సరాలు. ఒక్కొక్క సిద్ధాంతకర్తలు పెట్టిన ప్రళయకాల ముహుర్తాలు ఇవి… ఆమాటకొస్తే, 1999లోనే ప్రళయం వచ్చేస్తుందంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. 90వ దశకం ప్రారంభైనప్పటి నుంచీ 99లో ప్రళయం వచ్చేస్తుందన్న ప్రచారం ఊపెక్కింది. కాలజ్ఞానులు ఇదే విషయం చెప్పారంటూ అనేక పుస్తకాలు వచ్చేశాయి. కానీ 1999లో ఏమీ జరగలేదు. ఆ తరువాత 2035లో భూమి నాశనం అయిపోతుందంటూ ప్రచారం జరిగింది.
మీడియాలో హాట్ టాపిక్
…………………..
ఈ మధ్యకాలంలో ప్రచార మాధ్యమాలు పెరిగిపోతుండంతో ప్రళయం అనేది ఓ హాట్ టాపిక్ గా మారిపోయంది. దీంతో కొన్ని వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకోవడం కూడా ప్రారంభించాయి. కొంతమంది ఉత్సాహవంతులు పాతగ్రంధాలను తిరగేసి, మరగేసి 2012లోనే ప్రళయం వచ్చేస్తుందని తేల్చిపారేశారు. దీంతో ఈ సబ్జెక్ట్ పై సినిమాలు, నవలలు, సీరియల్స్ పుంఖానుపుంకలుగా వచ్చేశాయి.
2012 డిసెంబర్ 21ని డూమ్స్ డే గా పిలుస్తున్నారు. ఆ రోజున మొత్తం 9 గ్రహాలు ఒకే సరళరేఖపై వస్తాయట. అందువల్ల వివిధ గ్రహాల ఆకర్షణ, వికర్షణల ఫలితంగా భూగోళం అల్లకల్లోలమవుతుందట. డూమ్స్ డేతో భూమిపై జీవరాశి అంతమైపోతుంది.
పోలార్ షిప్మెంట్
………………
2012 డిసెంబర్ 21కి మరో ప్రత్యేకత ఉంది. ఆ రోజునే “పోలార్ షిప్మెంట్” జరుగుతుందని అంటున్నారు. అంటే ధ్రువాల మార్పిడి జరుగుతుందన్నమాట. కొంతమంది శాస్త్రజ్ఞులు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు. దీని పరిణామం తో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గాను, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం గాను మారుతాయి. ఫలితంగా ఏ ప్రాణీ కూడా మనుగడ సాగించే అవకాశం కూడా ఉండదని కొందరు అంటున్నారు.
అదేరోజు సుదూర ప్రాంతాల నుంచి దూసుకువస్తున్న గ్రహశకలం భూమిని ఢీకొంటుంది. దీంతో భూగోళంపై ప్రాణకోటి నశిస్తుందన్న ప్రచారం ఊపెక్కింది. భవిష్యత్ దార్శనికుడు నోష్ట్రడామస్, మాయన్స్ కాలెండరు కూడా ఇదే విషయాలను ధ్రువీకరిస్తున్నాయి.

ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. ప్రళయ కాలం ఒక ఏడాది ముందుకు వచ్చేసిందంటూ ప్రచారం ఊపెక్కింది. 2011 అంటే ఇదే ఏడాది మేనెలలోనే…అంటే ఈ నెలలోనే ప్రళయం వచ్చేస్తుందట. దీనికి సంకేతంగానే ఆకాశంలో నాలుగు గ్రహాలు కూటమిగా ఏర్పడ్డాయన్న వాదనలు వినబడుతున్నాయి.
…………………
సూర్యుడు మండిపోతున్నాడు.
అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయ్..
భూకంపాలు దేశాలనే వణికిస్తున్నాయ్..
సునామీలు విరుచుకుపడుతున్నాయ్…
ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయా?
అసలు ఇలా ఎందుకు జరుగుతోంది…?
ప్రకృతి వైపరీత్యాలకు గ్రహాలు అనుకూలంగా లేకపోవడమే కారణమన్న వాదనలు వినబడుతున్నాయి.
గ్రహచతుష్ఠయం వల్ల ఎన్నో అనర్ధాలు సంభవించబోతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. సూర్యుడు ఒక పక్క మండిపోతున్నాడు. సౌరసునామీ విరుచుకుపడుతోంది.
భూకంపాలతో దేశాలకుదేశాలు వణికిపోతున్నాయి. మొన్నటి జపాన్ భూకంపం…నిన్నటి స్పెయిన్ లో భూకంపం…ఇలా ఏరోజు ఏదేశానికి పెనుముప్పు వాటిల్ల్తుందో తెలియని పరిస్థితి. ఇంకో పక్క సునామీలు విరుచుకుపడుతున్నాయి. అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయి. ఎటు చూసినా విలయం…
వీటన్నింటికీ తోడు మానవ తప్పిదాలు పెనుశాపంగా మారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మానవాళి మనుగడనే సవాల్ చేస్తోంది. భూమి వెడెక్కిపోతున్నది! మునుపెన్నడూ లేనట్టుగా భూవాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా భూమి సెగలుకక్కుతోంది. గ్రీన్‌హౌస్ వాయువులతో అతలాకుతలం అవుతోంది.
వీటన్నింటికీ తోడు సౌరకుటుంబంలోని గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నది జ్యోతిష పండితుల అభిప్రాయం. గ్రహచతుష్ఠయం కారణంగా ఎప్పుడో రాబోయే ఉపద్రవాలు ఇప్పుడే ముంచుకువస్తాయట.

గ్రహచతుష్ఠయం – దుష్ఫలితాలు
…………………………
…………………………
- అనూహ్యమైన ప్రమాదాలు
- అంతుచిక్కని రోగాలు
- తరచుగా స్థానచలనాలు
- మానవాళి మనుగడకు ముప్పు
- రాజకీయ అస్థిరత
- యుద్ధాలు, ప్రాణ భయం
- భూకంపాలు
- సునామీలు
- అంతుచిక్కని రోగాలు
- తరచుగా స్థానచలనాలు
- మానవాళి మనుగడకు ముప్పు
- రాజకీయ అస్థిరత
- యుద్ధాలు, ప్రాణ భయం
- భూకంపాలు
- సునామీలు
గ్రహచతుష్ఠయం ఆకాశంలో స్పష్టంగా కనిపించిన రోజు మే 13- శుక్రవారం. ప్రాశ్చాత్యదేశాల్లో చాలామంది 13 అంకెతో కలిసివచ్చే శుక్రవారాన్ని బ్యాడ్ డే గా భావిస్తుంటారు. ఆరోజు నుంచి వినాశనం తప్పదని వారు గాఢంగా నమ్ముతుంటారు. సరిగా అలాంటి రోజునే వినీల ఆకాశంలో నాలుగు గ్రహాలు ఒక చోట చేరడం రాబోయే ప్రళయానికి సంకేతాలుగా చెప్పుకుంటున్నారు. ఎవరి సిద్ధాంతం వారిది.
ఎవరి రాద్ధాంతం వారిది…
అదిగో పులి…అంటే,
ఇదిగో తోక…అనేస్తున్నారు.
డూమ్స్ డే…యుగాంతం…ప్రళయం…ఇప్పుడు ఇవే ప్రపంచం మొత్తం అత్యధికంగా వినిపిస్తున్న పదాలు. నిద్రలేచినదగ్గర నుంచీ, రాత్రి నిద్రపోయేవరకు ఎటు చూసినా ఇవే కబుర్లు. అందుకే మనిషి బలహీనతలతో ఆడుకుంటున్న రూమర్స్ గంగవెర్రులెత్తిస్తున్నాయి. ఏలాగో ప్రళయం రాబోతున్నప్పుడు ఉన్న కొద్దికాలమైనా సర్వసుఖాలు అనుభవించండంటూ కొన్ని వెబ్ సైట్లు రెచ్చగొడుతున్నాయి. ఫిలిప్పీన్స్ లో ఒక ప్రైవేట్ రేడియే స్టేషన్ అయితే కనబడిన వారికళ్లా పాంప్లెట్స్ పంచిపెడుతోంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని వ్యాపారసంస్థలు కోట్లు సంపాదించుకుంటున్నాయి. ఏది నిజమో, మరేది రూమర్ తెలియక సామాన్యులు టెన్షన్ పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశంలో ఇప్పుడు కనిపిస్తున్న నాలుగు గ్రహాల కూటమి ఎలాంటి ప్రభావం చూపబోతున్నదో …అనుకుంటూ కంగారు పడిపోతుంటారా…లేక వినివీధిలో కనబడుతున్న గ్రహచతుష్ఠయాన్ని హాయిగా తిలకిస్తూ ఎంజాయ్ చేస్తారా అన్నది మీ ఇష్టం…

- తుర్లపాటి నాగభూషణరావు
email:nrturlapati@gmail.com
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి