ద‌టీజ్ మ‌మ‌తా బెన‌ర్జీ…


ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ సి.ఎం. గా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఏ సిఎం తీసుకోన‌టువంటి నిర్ణ‌యాన్ని ఈ దీదీ  తీసుకున్నారు. రాజ‌కీయాల్లో మిగ‌తా సి.ఎం.ల‌కి ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డారు.  ప్ర‌జ‌ల‌కి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డ‌మే సిఎంల ప్రధాన ల‌క్ష్యం.. వారి నుండి ప్ర‌జ‌ల‌కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త కూడా వారిదే. ముఖ్య‌మంత్రి కాన్వాయ్ రోడ్డుపై వ‌స్తుందంటే ఆయా రూట్ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌ని నిలిపివేయ‌డం, దాంతో ఆయా రోడ్ల‌న్నీ ట్రాఫిక్ జాం కావ‌డం, సి.ఎం. కాన్వాయ్ వెళ్ళిన త‌ర్వాత మ‌ళ్ళీ ట్రాఫిక్ క్లియ‌ర్ కావ‌డానికి చాలా టైం తీసుకోవ‌డం.. ఈ క్ర‌మంలో సాధార‌ణ పౌరులు తీవ్ర ఇబ్బందుల‌కి గురికావ‌డం సాధార‌ణంగా జ‌రుగుతుంది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ని గుర్తించి ఇక‌నుండి తాను ప్ర‌యాణించే దారిగుండా త‌న‌కోసం ప్ర‌త్యేకంగా ట్రాఫిక్ నిలిపివేయాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ పోలీసుల‌కు ఆజ్ఞాపించారు. ఇక నుండి బెంగాల్‌లో ముఖ్య‌మంత్రి కాన్వాయ్ కోసం వాహ‌న‌దారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవ‌డం అంటూ జ‌ర‌గ‌దు. ఈ నిర్ణ‌యం మిగ‌తా రాష్ట్ర మంత్రులు కూడా తీసుకుంటే ఎంత బావుంటుందో.. క‌దా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!