కరుణానిధికి హెల్త్ `షాక్’

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రికి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. 2జి స్ప్రెక్ట‌మ్ కేసులో క‌రుణానిధి కుటుంబ స‌భ్యులు పీక‌ల‌లోతు ల్లో మునిగిపోయి ఉన్నారు. ఇది క‌రుణానిధికి మొద‌టి షాక్‌.. ఈ కేసులో కేంద్ర మంత్రి ఎ. రాజా ఆల్రెడీ తీహార్ జైలులో ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూడ‌డం క‌రుణానిధికి రెండ‌వ షాక్‌.. అధికారం పోయినా ఆయ‌న పెద్ద‌గా బాధ ప‌డ‌లేక‌పోవ‌చ్చు.. కానీ 2జి స్పెక్ట్ర‌మ్ కేసులో త‌న గారాళ‌ప‌ట్టి, ఎం.పి. క‌నిమొళి కూడా జైలుకి వెళ్ళ‌డం ఆయ‌న‌కి మూడ‌వ షాక్‌.. ఈ సంఘ‌ట‌న ఆయ‌న్ని తీవ్రంగా క‌ల‌చివేసింది.. ఒక ద‌శ‌లో ఈ సంఘ‌ట‌న‌పై మీడియా స‌మావేశంలో స్పందిస్తున్న‌ప్పుడు ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. తాను ఎంతో గారాబంగా చూసుకున్న కూతురు జైలు పాలు కావ‌డం ఏ తండ్రికైనా బాధ క‌లిగించే విష‌య‌మే.. అది క‌రుణానిధికి మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఇటు అధికారం పోయి, అటు కుటుంబంలో క‌ల‌త‌లు రావ‌డంతో వ‌యోభారంతో ఉన్న ఆయ‌న ఆరోగ్యం అస్వ‌స్థ‌త‌కు గుర‌యింది. మ‌రి.. ఇన్ని స‌మ‌స్య‌ల‌ని ఆయ‌న ఎలా అధిగ‌మిస్తారో చూడాలి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!