పోస్ట్‌లు

sakala janula samme sakala janula sammey specialnews special articls hot news hot articls gossips kcr telangana saperate swamy goud kirankumar reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కేకే బృందంతో ర‌హ‌స్య చ‌ర్చలు..

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో ఉన్నసమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నాయకత్వంలోని బృందంతో చర్చలు జరుపుతోంది. ఇరు ప్రాంతాల నాయకులతో ఒక అవగాహన కుదర్చడం కోసం అధిష్టానం గట్టి ప్రయత్నం చేస్తోంది.కాని ఇరు ప్రాంతాల నేతలు తమ,తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో సమస్య ఒక కొలిక్కి రావడం లేదు.ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అధిష్టానానికి అంతుపట్టడం లేదు. మరి రహస్య చర్చలు ఏమైనా ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకువస్తాయా అన్నది చూడాలి.కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ను కలిసి సకల జనుల సమ్మె తదితర అంశాలపై వివరణ ఇస్తున్నారు.

సిఎం ఢిల్లీ ప‌ర్యట‌ణ వెనుక‌..?

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండురోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారం బెంగళూరు వెళుతున్న ఆయన, అటు నుంచి అటే ఢిల్లీకి పయనమవుతారు. సడలుతున్న సకల జనుల సమ్మె , రైల్‌రోకో అనంతర పరిస్థితులపై, రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపై అధిష్ఠానం పెద్దలతో ఆయన సమాలోచనలు జరుపుతారు. శనివారం జాతీయాభివృద్ధి మండలి(ఎన్‌డీసీ) భేటీలో పాల్గొంటారు. కాగా, ఆయన ఢిల్లీకి వెళ్లడం ఈ నెలలో ఇది రెండోసారి.  సరిగ్గా పది రోజుల కిందట సకల జనుల సమ్మె సెగతో ‘ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు” అన్న ప్రశ్న అధిష్ఠానాన్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో పార్టీ కోర్ కమి టీ నేతలు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లను కలిసి కిరణ్ సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పూర్తిస్థాయి ఆత్మస్థైర్యంతో అధిష్ఠానం ఎదుటకు వెళుతున్నారు.  ఆర్టీసీ,సింగరేణి, ప్రైవేట్ పాఠశాలల జేఏసీలు ఒక్కొక్కటిగా సమ్మె నుంచి బయటకు వస్తుండటం, రైల్‌రోకో ఉద్యమం అనుకున్నంత ప్రభావం చూపలేకపోవడం వంటివి ఆయనకు ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక...

తెలంగాణ స‌మ‌స్య ఇప్పట్లో తెగ‌దు..

చిత్రం
తెలంగాణ పై ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ పాత పాటే పాడారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం కష్టమైన పని అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ ఆఫ్రికా నుంచి తిరిగి వస్తూ మీడియాతో మాట్లాడారు. ఇటీవలి రోజులలో తెలంగాణపై ఒక ఈనెలాఖరు లేదా, నవంబరు మొదటి వారంలో నిర్ణయం జరగవచ్చని ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రధానే స్వయంగా ఈ ప్రకటన చేయడం మళ్లీ అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ అంశం ఇప్పట్లో తేలదన్న సంకేతాన్ని ఆయన ఇస్తున్నారు.వచ్చే ఏడాది మదట్లో తెలంగాణ వస్తుందని అద్వాని ప్రకటించిన రోజే ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం.

జానాతో టి-ఎంపీల వాగ్వాదం..

చిత్రం
రైల్ రోకో తర్వాత సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ భేటీ వాడివేడిగా సాగింది. టి.ఎంపీలంతా హాజరయిన ఈ భేటీకి మంత్రి జానారెడ్డి మాత్రమే హాజరయ్యారు. దీంతో జానారెడ్డిని తెలంగాణ ఎంపీలంతా విరుచుకుపడ్డారు. ఎంపీలంతా అరెస్టలయితే మీరేం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి దానంను అడ్డుకుంటే స్పందించిన పిసిసి చీఫ్ బొత్స ఎంపీలంతా అరెస్టులయితే కనీసం పట్టించుకోవడం కానీ, పరామర్శ చేయడం కానీ చేయలేదని వాపోయారు. సీఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సలు సమైక్యాంధ్రకు మద్ధతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎంపీలపై అక్రమకేసులు పెడితే బొత్స ఎందుకు స్పందించడం లేదని ఎంపీ పొన్నం ప్రశ్నించారు. ఇంతా జరుగుతున్నా కేబినేట్ లో ఉన్న మంత్రులు కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వాపోయారు.

కొన‌సాగుతున్న తెలంగాణ బంద్‌

చిత్రం
తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు డిపోల్లో బస్సులు నిలిచిపోగా, మరికొన్ని డిపోల ఎదుట తెలంగాణవాదులు ధర్నాకు దిగారు. కాగా విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బంద్ కారణంగా సికింద్రాబాద్-ఫలక్ నూమ మధ్య ఎంఎంటీఎస్ సర్వీస్ లు రద్దు అయ్యాయి. ప్రభుత్వ అనాగరిక చర్యలు, పాశవిక పాలనలపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఆర్‌.టి.సి.పై ఈ బంద్ ప్రభావం స్పష్టంగా క‌నిపిస్తోంది. నిన్నటి (ఆదివారం) నుండే బ‌స్సులు రోడ్డుపైకి వ‌చ్చాయి. అయితే ఒక్కరోజుకూడా న‌డ‌వ‌క‌ముందే బంద్ కార‌ణంగా బ‌స్ డిపోల్లోనుండి బ‌స్సులు బ‌య‌టికి రాకుండా ఆయా డిపోల ఎదుట ఉద్యమ‌కారులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు.

ఉప్పు స‌త్యాగ్రహం ఉద్యమం స్థాయి తెలంగాణ ఉద్యమానిది..

చిత్రం
ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఆ స్థాయిలో తెలంగాణ ఉద్యమం సాగుతోందని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రజలపై ప్రభుత్వం హింసను ప్రయోగించిందని, అయినప్పట్టికీ రైల్ రకోను ప్రజలు విజయవంతం చేశారని ఆయన ప్రకటించారు. మహిళలను రాత్రంతా పోలీస్ స్టేషన్ లలో ఉంచారని, మహిళా నేత హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం డిజిపినే ఎవరిపై ఏ కేసులు పెట్టాలో నిర్దేశించారని కోదండరామ్ ఆరోపించారు.రాష్ట్రంలో అనాగరిక పాలన జరుగుతోంటే కేంద్రం చోద్యం చూస్తున్నదని ఆయన అన్నారు. కాగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన మంత్రులు సమ్మలను విరమించాలని కోరడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. జై తెలంగాణ నినాదం చేసిన వ్యక్తిపై మంత్రి దానం నాగేందర్ దాడి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు. సోమవారం బంద్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సి.ఎం.ని టి-ప్రజ‌లు స‌హించ‌రు..

చిత్రం
ఇప్పటికే మంత్రిగా రాజీనామా చేసిన తాను అవసరమైతే పార్టీని కూడా వదలుకోవడానికి సిద్దమేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చేస్తున్నదని, తెలంగాణ ప్రజలు తిరగబడతారని, ముఖ్యమంత్రిని ఉరికిస్తారని తీవ్రంగా అన్నారు.కరీంనగర్ వెళ్లి అరెస్టు అయిన ఎమ్.పి పొన్నం ప్రభాకర్ ను వారు పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుడు కె.కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం విప్లవంగా మారుతుందని హెచ్చరించారు. మరో ఎమ్.పి వివేక మాట్లాడుతూ ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాగర్ కర్నూల్ ఎమ్.పి మందా జగన్నాధం మాట్లాడుతూ తాము మూడునెలల క్రితమే తమ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని ఒత్తిడి చేస్తున్నామని అన్నారు. కాగా టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తో టిఆర్ఎస్ మాచ్ ఫిక్సింగ్ చేసుకుని వ్యవహరిస్తున్నదని అన్నారు. తాము కూడా ఉద్యమంలో కలిసి వస్తామని చెబితే ఎందుకు అంగీకరించడం లేదని టిజెఎసిని ఆయన ప్రశ్నించారు.కాగా తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ క...

రైలురోకోను ఆపే ద‌మ్మెవ‌రికుంది..?

చిత్రం
తెలంగాణ ఉద్యమ నేత కె.చంద్రశేఖరరావు వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాలు విసురుతున్నారు. సి.ఎమ్. ఎన్నివేశాలు వేసినా ఉద్యమం ఆగదని ఆయన స్ప్టం చేశారు.ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా శాంతియుతంగా ఉద్యమిస్తామని అంటూనే రైళ్లను ముఖ్యమంత్రి తిప్పగలరా అన్న సవాలును విసిరారు.రైలు పట్టాలపై కోటి మంది వస్తారని, వారందరిని ఆపగలరా? అని కెసిఆర్ అన్నారు.వంద శాతం తెలంగాణ వచ్చితీరుతుందని,తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు అన్ని రకాల ప్రోత్సహాకాలు ఉంటాయని, ప్రమోషన్లు, వడ్డీతో సహా జీతాలు, ఒక నెల బోనస్ ఇస్తామని ఆయన ప్రకటించారు.హైదరాబాద్ లో జరిగిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.ఆర్టీసి లో సమ్మె విరమించినట్లు ప్రకటించినా ఎవరూ హాజరు కాలేదని, అబద్దాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.స్వామిగౌడ్ మీద ఉన్న కేసుపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , మంత్రులు సి.ఎమ్. బూట్లు తుడుచుకుంటున్నారని ఎద్దేవ చేశారు.తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులందరి ఉద్యోగాలను పర్మనెంటు చేస్తామని కూడా ఆయన అన్నారు.తెలంగాణపై ఎన్నాళ్...

పోలీసులు స‌హ‌నం కోల్పోతున్నారా..?

చిత్రం
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంపై సీరియస్ గా ఉంటామని హెచ్చరిస్తోంది.లా అండ్ ఆర్డర్ ఐజి అనురాధ మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు ఓపికగా ఉన్నామని,ప్రజలు తమను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని ఆమెఅన్నారు.విద్యాసంస్థలు స్వచ్చందంగా సమ్మె చేస్తున్నాయని చెబుతున్న ఉద్యమ కారులు ఆ సంస్థలపై ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యమ నేతలపై ఇంతవరకు ఉదయం ఆందోళన సమయంలో అరెస్టు చేసి సాయంత్రం వదలిపెడుతూ వచ్చామని , ఇకపై అలా ఉండదని, అరెస్టు చేసి రిమాండుకు పంపుతామని ఆమె హెచ్చరించారు. అంటే దీని అర్ధం ఇకపై తెలంగాణ ఉద్యమంలో అరెస్టు అయినవారిని వదలిపెట్టకుండా జైలు కు పంపుతామని హెచ్చరిస్తున్నారన్నమాట. బెయిల్ కావాలంటే కోర్టుకు వెళ్లవలసి వస్తుందని అర్ధం ఈ హెచ్చరిక ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అయితే ప్రభుత్వ వైఖరిని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే తారకరామరావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు.ఫ్యాక్షన్ నాయకుడి మాదిరి ముఖ్యమంత్రి కిరణ్ వ్యవహరిస్తున్నారని ఆయన...

తెలంగాణ‌పై నాన్చుడు ధోర‌నే కొన‌సాగుతుందా..?

చిత్రం
కేంద్ర ఆర్ధిక మంత్రి,కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన తీరు తెలంగాణ ఉద్యమ నేతలకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.జాతీయ స్థాయి నేతలంటే యుపిఎ పక్షాల, ఎన్.డి.ఎ పక్షాలకు చెందిన కేంద్ర నేతలనుకుంటుంటే ఇప్పుడు ఆయన కొత్త ప్రతిపాదన చేసినట్లు కధనాలు వస్తున్నాయి.దేశంలోని ఇతర రాష్ట్రాలలోని కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరపాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.దీంతో ఈసమస్య ఇంకెన్నాళ్లు సాగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.ఉత్తరప్రదేశ్ లో మూడు రాష్ట్రాలు చేయాలని కాంగ్రెస్ తీర్మానం చేయడం, పశ్చిమబెంగాల్ లో గూర్ఖాలాండ్ సమస్య, మణిపూర్ లో నాగాల సమస్య , ఇలా వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు తెరపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకు చికాకు కలిగించవచ్చని వీరు భయపడుతున్నారని అంటున్నారు. అయితే ఓట్ల రాజకీయం వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పెద్దలకు ఇవేవి గుర్తుకు రాలేదు.అప్పుడు రెండువేల నాలుగు సంవత్సరంలో రెండో ఎస్ఆర్సీ తీర్మానం చేయాలని సూచించిన ప్రణబ్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతల అ...

కేసీఆర్ పై కేసు న‌మోదు

చిత్రం
కేసీఆర్, టి జెఏసీ పై కేసు న‌మోద‌యింది. త‌మ ప్రసంగాల‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నాడ‌ని పోలీసులు కేసు న‌మోదు చేసారు. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం నాడు కేసీఆర్ ఢిల్లీ టూర్ చేయ‌వ‌ల‌సిఉంది. అయితే ఆర్‌.టి.సి. స‌మ్మె విర‌మ‌ణ నేప‌థ్యంలో జ‌రిగిన అరెస్టుల కార‌ణంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. స‌క‌ల జ‌నుల స‌మ్మెలో భాగంగా నిర‌స‌న‌లు తెలుపుతున్న ఉద్యమ కారుల‌ను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేస్తూ ఉద్యమాన్ని నీరుకార్చేందుకు ప్రయ‌త్ని స్తున్నార‌ని, ఈ అరెస్టుల‌తో కేసీఆర్ మ‌న‌స్థాపం చెందార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రసంగాలాతో పోలీసులు కూడా ప్రభావితం చెందుతున్నార‌ని, తెలంగాణ పోలీసులు కూడా ఉద్యమంలోకి వెళ్ళేందుకు ఉవ్విళ్ళూరుతున్నార‌ని అందుకే కేసీఆర్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నందుకు కేసు పెట్టామ‌ని పోలీసులు చెబుతున్నారు.