తెలంగాణ‌పై నాన్చుడు ధోర‌నే కొన‌సాగుతుందా..?


కేంద్ర ఆర్ధిక మంత్రి,కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన తీరు తెలంగాణ ఉద్యమ నేతలకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.జాతీయ స్థాయి నేతలంటే యుపిఎ పక్షాల, ఎన్.డి.ఎ పక్షాలకు చెందిన కేంద్ర నేతలనుకుంటుంటే ఇప్పుడు ఆయన కొత్త ప్రతిపాదన చేసినట్లు కధనాలు వస్తున్నాయి.దేశంలోని ఇతర రాష్ట్రాలలోని కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరపాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.దీంతో ఈసమస్య ఇంకెన్నాళ్లు సాగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.ఉత్తరప్రదేశ్ లో మూడు రాష్ట్రాలు చేయాలని కాంగ్రెస్ తీర్మానం చేయడం, పశ్చిమబెంగాల్ లో గూర్ఖాలాండ్ సమస్య, మణిపూర్ లో నాగాల సమస్య , ఇలా వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు తెరపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకు చికాకు కలిగించవచ్చని వీరు భయపడుతున్నారని అంటున్నారు. అయితే ఓట్ల రాజకీయం వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పెద్దలకు ఇవేవి గుర్తుకు రాలేదు.అప్పుడు రెండువేల నాలుగు సంవత్సరంలో రెండో ఎస్ఆర్సీ తీర్మానం చేయాలని సూచించిన ప్రణబ్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.ప్రణబ్ చాణక్యం అంటే ఇదేనని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!