39కోట్ల 57లక్షల ఆసామి చంద్రబాబు
తెలుగుదేశం అధినేత, తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్య మంత్రిగా కొనసాగిన చంద్రబాబు నేడు తన ఆస్తుల వివరాలని వెల్లడించి సంచలనం సృష్టించారు. రెండెకరాల ఆసామి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా మూటగట్టుగుకున్నారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.. తనపై వచ్చిన ఈ ఆరోపణలకు చంద్రబాబు స్పందించారు. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులు రాసిస్తానని చెప్పడంతో ప్రత్యర్థులు చం ద్రబాబును ఇరకాటంలో పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది. 1999 నుంచి అంటే నేను సీఎం అయినప్పటి నుంచి, అలాగే నా కుటుంబసభ్యులు నలుగురి ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 39కోట్ల 57లక్షలుగా ప్రకటించారు. అయితే ఇవి నలుగురుకి చెందినివిగా చంద్రబాబు ప్రకటించారు. అలాగే కోడలు రావడం వల్ల కొత్తగా ఆస్తులు ఏమీ రాలేదని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఇళ్లు విజయబ్యాంకులో తనఖా పెట్టానని చెప్పారు. ఆ ఇల్లు విలువ అప్పట్లో 23లక్షలని చెప్పారు. నాకుమారుడు,కూతురు,భార్య వ్యాపారాలు...