39కోట్ల 57లక్షల ఆసామి చంద్ర‌బాబు


తెలుగుదేశం అధినేత‌, తొమ్మిది సంవ‌త్స‌రాల పాటు ముఖ్య‌ మంత్రిగా కొన‌సాగిన చంద్ర‌బాబు నేడు త‌న ఆస్తుల వివ‌రాల‌ని వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించారు. రెండెక‌రాల ఆసామి వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఎలా మూట‌గ‌ట్టుగుకున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం తెలిసిందే.. తనపై వచ్చిన  ఈ ఆరోపణలకు చంద్రబాబు స్పందించారు. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులు రాసిస్తానని చెప్పడంతో ప్రత్యర్థులు చం ద్రబాబును ఇరకాటంలో పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది. 1999 నుంచి అంటే నేను సీఎం అయినప్పటి నుంచి, అలాగే నా కుటుంబసభ్యులు నలుగురి ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 39కోట్ల 57లక్షలుగా ప్రకటించారు. అయితే ఇవి నలుగురుకి చెందినివిగా చంద్రబాబు ప్రకటించారు. అలాగే కోడలు రావడం వల్ల కొత్తగా ఆస్తులు ఏమీ రాలేదని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఇళ్లు విజయబ్యాంకులో తనఖా పెట్టానని చెప్పారు. ఆ ఇల్లు విలువ అప్పట్లో 23లక్షలని చెప్పారు. నాకుమారుడు,కూతురు,భార్య వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. నా భార్య పేరుమీద 73లక్షల ఇంటి జాగా పంజాగుట్టలో ఉందని, శ్రీపెరంబుదూర్‌లో యాబైవేల అడుగుల జాగా ఉందని, అలాగే మదీనాగూడలో ఐదు ఎకరాలు ఆస్తి ఉందన్నారు. బహుశా దేశంలో ఏ రాజకీయనేత కూడా కుటుంబసభ్యులతో సహా ఆస్తుల వివరాలు ప్రకటించలేదని చంద్రబాబు చెప్పారు. అయితే ప్రకటించిన ఆస్తుల వివరాలు ప్రస్తుత విలువ ప్రకారం కాదని, కొన్నప్పుడు విలువని, ఇప్పుడు కాస్త పెరిగి ఉండవచ్చునని చంద్రబాబు చెప్పారు.

కామెంట్‌లు

  1. గౌరవనీయులైన చంద్ర బాబు నాయుడు గారు ఈ ముప్పై కోట్ల ఆస్తిని
    ఎవరైనా వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం రాసిచ్చేస్తారట.
    భలే మంచి చౌక బేరము ...
    ఆఆ... భలే మంచి చౌక బేరము
    ఆలసించిన ఆశా భంగము
    త్వరపడండి
    సుజనులారా త్వరపడండి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!