పోస్ట్‌లు

salman khan bodygaurd dabaang ready wanted income tax bollywood movies bollywood movie reviews bollywood movie news bollywood gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఐదుకోట్లు ట్యాక్స్ క‌ట్టిన హీరో

చిత్రం
వ‌రుస విజ‌యాల‌తో ముందుకు దూసుకు వెళుతున్న బాలీవుడ్ హీరో్ స‌ల్మాన్‌ఖాన్‌. వాంటెడ్‌, ద‌బాంగ్‌, రెడీ, బాడీగార్డ్ చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో నెంబ‌ర్‌వ‌న్ గా వెలుగొందుతున్నాడు స‌ల్మాన్‌. సినిమాలు విజ‌యం సాధించ‌డంతో కోట్లాది రూపాయ‌ల సంపాద‌న కూడా స‌హ‌జంగానే వ‌స్తుంది. అందుకు ఈ ఏడాది జూలై త్రైమాసానికి గాను ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ పన్ను చెల్లించి రికార్డు సృష్టించారని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం రెండు కోట్ల పన్ను చెల్లించిన సల్మాన్ ఖాన్ ఈ ఏడాడి అడ్వాన్ పన్నుకిందే ఇంత మొత్తం చెల్లించడం విశేషంగా ఉంది. ఇటీవలికాలంలో అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతున్న నేపధ్యంలో సినీ నటులు నిజాయితీగా పన్ను చెల్లించాలని భావించడానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చని అంటున్నారు.గత ఏడాది అమీర్ ఖాన్ ఐదు కోట్లు పన్ను చెల్లించగా, రణబీర్ కపూర్ రెండున్నర కోట్ల రూపాయల మేర పన్ను చెల్లించారు. మొత్తం మీద సినీ రంగంలో మార్పు వస్తే అది పెద్ద సంచలన విషయమే అవుతుంది.ఎందుకంటే బ్లాక్ మనీ విషయంలో సినిమా రంగం అగ్రభాగాన ఉంటుందన్న సంగతి తెలిసిందే.