పోస్ట్‌లు

Botsa Satyanarayana CLP Leader ap congress president ap political news political news political setairs hot news political reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గవర్నర్ కాన్వాయి ప్రమాదం-తప్పెవరిది

చిత్రం
ప్రభుత్వ ప్రముఖులకు, ఇతర ప్రముఖులకు ఐదు , అంతకన్నా మించి వాహనాలతో కాన్వాయి ఉంటుంది. వి.ఐ.పి.ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్వాయిలను ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, జిల్లాలకు వెళ్లినప్పుడు మంత్రులకు కాన్వాయిలు ఉంటాయి. కొందరు నేతలు ప్రైవేటు గా భారీ కాన్వాయిలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కాని వారి కోసం రోడ్ ట్రాఫిక్ అంతటిని నిలిపివేసి ఎక్కడా ఇబ్బందిలేకుండా చేస్తారు. దీంతో వాహనాలు వాయువేగంతో వెళుతుంటాయి. అలాంటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే, ఈ వాహనాలు పోటీపడి పరుగులు తీస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాన్వాయికి ప్రమాదంజరిగింది. అలాగే ఆయా ప్రముఖుల కాన్వాయిలకు ప్రమాదాలు జరిగిన ఘటనలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. రోడ్ క్లియర్ గా ఉండడంతో అతివేగంగా వెళ్లడం వల్ల ఒకదానిని ఒకటి అందుకోవడానికి వాహనాల డ్రైవర్లు పోటీపడుతున్న సందర్బంలో ఒక్కోసారి అదుపు తప్పి బోల్తా పడడమో, లేక స్తంభాలను ఢీకొట్టడమో, లేక మనుషులను ప్రమాదాలకు గురిచేయడమో జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ కాన్వాయి కూడా ఇలాంటి సంద...

ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అలంకార ప్రాయ‌మేనా..?

చిత్రం
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఒక ఒప్పందం కుదిరింది దానిని పెద్ద మనుషుల ఒప్పందంగా పిలుస్తారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ పెద్దలంతా కలిసి కూర్చుని, చర్చించుకుని తయారు చేసిన ఒప్పందంపై ఆనాటి పెద్దలు సంతకాలు చేశారు. నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కె.వి.రంగారెడ్డి,గౌతు లచ్చన్న వంటి ప్రముఖులు దీనిపై సంతకాలు చేశారు.ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి కోస్తాలేదా రాయలసీమ వారైతే, తెలంగాణ వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాని నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రిని నియమించలేదు. పైగా ఎవరైనా విమర్శిస్తే అది ఆరో వేలు వంటిదని తెలంగాణ నాయకుడు కె.వి.రంగారెడ్డి కూడా అన్నారని చెప్పేవారు.అదేమంటే తాను కూడా గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి చేశానని, దానిలో ఒక్క అదనపు అదికారం ఉండదని, ఆరో వేలు వంటిదని ఆయన అన్నారు. ఒకసారి ఆనాటి తెలంగాణ నేత కెవి రంగారెడ్డి ఒకసారి ఆస్పత్రిలోఉన్నారు. అప్పుడు ఆయన వద్దకు వెళ్లి ఉప ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించారు. ఆ సందర్భంగా ఆ పదవి ఇవ్వకపోయినా ఫర...

బొత్స కే పీసీసీ పదవి ?

చిత్రం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడుగా నామినేట్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి . పిసిసి అధ్యక్ష పదవికి బొత్స తో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పరిశీలనలో వుంది. అయితే  కాంగ్రెస్ అధిష్టానం బొత్స వైపే మొగ్గు చూపుతు న్నట్టు సమాచారం.  రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గమంతా  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళే అవకాశాలు  ఉండటం తో  మరో బలమైన కాపువర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించేందుకు బొత్స సత్యనారాయణను ఎంపిక చేయ వచ్చని  అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పోలిస్తే బొత్స పిసిసికి పటిష్ఠమైన నాయకత్వాన్ని ఇవ్వగలుగుతారనీ, సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా ఆయనకు మంచి పలుకుబడి ఉందని కాంగ్రెస్ అగ్ర నేతలు భావిస్తున్నారు .బొత్స తెలంగాణకు సానుకూలం కావడం మరో అనుకులాంశం అంటున్నారు. మరో కాపు నేత చిరంజీవి కూడా బొత్స కే మద్దతు పలికారని చెబుతున్నారు కాగా సీఎం కిరణ్ మాత్రం మంత్రి శ్రీధర్ బాబు ,మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్ ల...