బొత్స కే పీసీసీ పదవి ?
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడుగా నామినేట్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి . పిసిసి అధ్యక్ష పదవికి బొత్స తో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పరిశీలనలో వుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం బొత్స వైపే మొగ్గు చూపుతు న్నట్టు సమాచారం. రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గమంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళే అవకాశాలు ఉండటం తో మరో బలమైన కాపువర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించేందుకు బొత్స సత్యనారాయణను ఎంపిక చేయ వచ్చని అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పోలిస్తే బొత్స పిసిసికి పటిష్ఠమైన నాయకత్వాన్ని ఇవ్వగలుగుతారనీ, సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా ఆయనకు మంచి పలుకుబడి ఉందని కాంగ్రెస్ అగ్ర నేతలు భావిస్తున్నారు .బొత్స తెలంగాణకు సానుకూలం కావడం మరో అనుకులాంశం అంటున్నారు. మరో కాపు నేత చిరంజీవి కూడా బొత్స కే మద్దతు పలికారని చెబుతున్నారు కాగా సీఎం కిరణ్ మాత్రం మంత్రి శ్రీధర్ బాబు ,మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్ ల పేర్లను సూచించినట్టు తెలుస్తోంది . ఇదిలా వుంటే బొత్స పీసీసీ నేత అయితే మరో అధికార కేంద్రం ఏర్పడే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఇప్పటికే సీఎం కి బొత్స కి సరైన సంబంధాలు లేవు. ఈ అంశం గురించే అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది .
KNM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి