యజుర్వేద మందిరం తలుపులు తెరుచుకున్నాయి.. రహస్యంగా..
పుట్టపర్తి సత్యసాయిబాబ ట్రస్టు ఆధ్వర్యంలో అత్యంత కీలకమైన యజుర్వేద మందిరం తలుపులు తెరిచారు. సత్యసాయిబాబ మరణించినప్పటినుంచి ఆ మందిరం ద్వారాలు మూసి ఉంచారు. ఆ మందిరంలో విలువైన వస్తువులు, భారీ ఎత్తున బంగారం, వజ్రాలు, నగదు వంటివి ఉన్నాయని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఆ మందిరానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అది ఎలా తెరవాలన్నదానిపై కూడా తర్జనభర్జనలు జరిగాయి. ట్రస్టు సభ్యులు రత్నాకర్, ఎస్.వి.గిరి వంటివారితోపాటు సత్యసాయి ముఖ్య శిష్యుడైన సత్యజిత్ కూడా ఉండడం విశేషం. సత్యసాయికి సంబంధించిన అనేక విషయాలు తెలిసిన వ్యక్తిగా సత్యజితే పేరొందారు. కాగా యజుర్వేదమందిరంలో ట్రస్టు సభ్యులు ప్రవేశించిన సమయంలో మీడియాను అక్కడకు అనుమతిం చలేదు.అలాగే భక్తులను కూడా అక్కడకు అనుమతించలేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి