వారానికో స్టార్ సినిమా..
దసరా, దీపావళి పండుగలని పురస్కరించుకుని సెప్టెంబర్ ఆఖరివారం నుండి అక్టోబర్ ఆఖరి వారం వరకూ వారానికో స్టార్ హీరో సినిమా థియేటర్లలో సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల సినిమాలన్నీ నెల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాలలో ఏ సినిమా హిట్ కొడుతుందో.. ఏ చిత్రం ఫట్టుమంటుందో అని ఎదురు చూస్తున్నారు. ఇక స్టార్ హీరో మహేష్‌బాబు తన దూకుడు చిత్రంతో అందరికంటే ముందుగానే వచ్చి పలకరించనున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్దమైంది. శ్రీనువైట్ల, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్ ఈ చిత్రం పై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనడంతో ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని మహేష్‌బాబు నమ్మకంగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 30న రాజన్నగా ముందుకు రాబోతున్నాడు అక్కినేని నాగార్జున.గ్రేటెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, రాజమౌళి ఈ ...