వారానికో స్టార్ సినిమా..


ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ ఆఖ‌రివారం నుండి అక్టోబ‌ర్ ఆఖ‌రి వారం వ‌ర‌కూ వారానికో స్టార్ హీరో సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. స్టార్ హీరోల సినిమాల‌న్నీ నెల వ్య‌వ‌ధిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రాలలో ఏ సినిమా హిట్ కొడుతుందో.. ఏ చిత్రం ఫ‌ట్టుమంటుందో అని ఎదురు చూస్తున్నారు. ఇక స్టార్ హీరో మ‌హేష్‌బాబు త‌న దూకుడు చిత్రంతో అంద‌రికంటే ముందుగానే వ‌చ్చి ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కి సిద్ద‌మైంది. శ్రీ‌నువైట్ల‌, మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో వ‌స్తున్ ఈ చిత్రం పై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన‌డంతో ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని మ‌హేష్‌బాబు న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఇక ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 30న రాజ‌న్న‌గా ముందుకు రాబోతున్నాడు అక్కినేని నాగార్జున‌.గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, రాజ‌మౌళి ఈ చిత్రంలోని యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ని ప్ర‌త్యేకంగా రూపొందించ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో నాగార్జున విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.. మ‌రి ఈ చిత్రం ఏమేర‌కు స‌క్సెస్ సాధిస్తుందో అన్న‌ది చూడాలి. ఇక ఎన్టీఆర్‌, సురేంద‌ర్‌రెడ్డిల కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రం ఊస‌ర‌వెల్లి.. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 6న ద‌స‌రా పండుగ‌రోజునే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఎన్టీఆర్‌, సురేంద‌ర్ రెడ్డిలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎన్టీఆర్ ఖాతాల ఊస‌ర‌వెల్లి చిత్రం సూప‌ర్‌డూప‌ర్‌హిట్ చిత్రంగా న‌మోదుకానుంద‌ని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆశిస్తున్నారు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న బాడీగార్డ్ చిత్రాన్ని అక్టోబ‌ర్ 14న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మ‌ళ‌యాలంలో సూప‌ర్‌స‌క్సెస్ సాధించిన ఈ చిత్రం హిందీలో స‌ల్మాన్ హీరోగా అదే టైటిల్‌తో రూపొంది ఈ మ‌ధ్యే రిలీజ‌యింది. మ‌రి తెలుగులో వ‌స్తున్న ఈ బాడీగార్డ్ ఏమేర‌కు స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి. నాగ‌చైత‌న్య హీరోగా వ‌స్తున్న మాస్ ఓరియంటెడ్ చిత్రం బెజ‌వాడ‌. ఈ చిత్రం టైటిల్ వివాదం న‌డుమ ఈ మ‌ధ్యే టైటిల్ మార్పుచేసుకుని విడుద‌ల‌కి సిద్ద‌మైంది. బెజ‌వాడ నేప‌థ్యంలో సాగిపోతున్న క‌థ‌తో వ‌స్తున్న ఈ చిత్రం నాగ‌చైత‌న్య‌కి స‌క్సెస్ తెచ్చిపెడుతుందా.. లేదా.. అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇక వీటి మ‌ధ్య‌లోనే గోపీచంద్‌, కృష్ణ‌వంశీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొగుడు, అల్ల‌రిన‌రేష్ హీరోగా రూపొందిస్తున్న మ‌ర‌త‌కాజ‌, జ‌గ‌ప‌తిబాబు హీరోగా వ‌స్తున్న క్షేత్రం కూడా విడుద‌ల‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి.. ఒకే నెల‌లో ఒకేసారి ఇంత‌మంది స్టార్ హీరోల చిత్రాలు రావ‌డం అభిమానుల‌కు పండుగే పండుగ‌.. కానీ ఈ చిత్రాల‌లో ఎన్ని చిత్రాలు విజ‌యాలు సాధిస్తాయి.. ఎన్ని చిత్రాలు అప‌జ‌యాలు సాధిస్తాయి అన్న‌ది వేచి చూడాల్సిందే..!
-సిహెచెస్కే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!