చిక్కుల్లో ‘బెజవాడు రౌడీలు’
బెజవాడ రౌడీలు టైటిల్ ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయి కూర్చుంది సినిమా ఇండస్ట్రీలో.. రాంగోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్నాడంటే.. ఖచ్చితంగా ఆ సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం షరా మామూలుగానే జరుగుతుంది.. ఓ చిత్రం హింస పాలు ఎక్కువుందని, మరో చిత్రంలో బూతు పాలు ఎక్కువుందని తదితర కారణాలతో రాము చిత్రాలు ఎప్పుడూ వివాదం అవుతూనే ఉంటాయి. అయితే అలాంటి వివాదాలు ఎన్ని వచ్చినా డోంట్ కేర్.. అంతా నా ఇష్టం.. అని తన పని తాను చేసుకుపోయేవాడు రాంగోపాల్‌వర్మ.. కాల క్రమంలో సినిమా ఫలితానికి సంబంధంలేకుండా వివాదాలు కూడా సద్దుమణిగేవి… కానీ.. ఇప్పుడు బెజవాడ రౌడీలు చిత్ర వివాదం మాత్రం రాంగోపాల్‌వర్మ అనుకున్నంత ఈజీగా సమసిపోయే ఛాన్స్ కనిపించటం లేదు.. అలాగే రామూ కూడా ఈ వివాదాన్ని షరా మామూలుగా కొట్టి పారేసే అవకాశం లేదు.. బెజవాడ రౌడీలు అనే టైటిల్ బెజవాడ ప్రజల మనోభావాలని దెబ్బతీసిందని మొదలైన వివాదం, రామూ తేలికగా కొట్టివేయడంతో నిరాహారదీక్షల వరకూ వెళ్ళింది. అయినా రామూ కూడా బెజవాడకి చెందిన వాడే.. అతనొక్కడు రౌడీ అయినంత మాత్రాన బెజవాడ ప్రజ...