చిల్లర `పెద్దన్న’ల దోపిడీ-2
విదేశీ కంపెనీలు ధరలు ఎడాపెడా పెంచకుండా ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కొన్నేళ్ల కిందట దేశీయ రిటైల్ కూరగాయల మార్కెట్ లోకి కూడా బడాకంపెనీలు ప్రవేశించాయి. అప్పుడు కూడా అనేక విమర్శలు తలెత్తాయి. చిల్లర దుకాణాలకూ, కూరగాయల వ్యాపారాలకు తీవ్రనష్టం కలుగుతుందని ఇది సామాన్యుల జీవనంపై పెను ప్రభావం చూపుతోందని ఘాటైన విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ దేశీయ బడా సంస్థల సూపర్ మార్కెట్లను ఎవ్వరూ ఆపలేకపోయారు. అవి ఇప్పుడు నగరాలుదాటి పట్టణాలు, పలెల్లో కూడా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఆ పని విదేశీ సంస్థలు చేయబోతున్నాయి. అంతే తేడా. ఇదో దోపిడీ దేశీయ రిటైల్ మార్కెట్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై యూపీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ స్వరం పెంచుతోంది. అయితే, ఇదే బీజేపీ 2004 వరకు ఎఫ్.డి.ఐలను సమర్ధించడాన్ని మరిచిపోకూడదు. అసలు విపక్షాలు ఎందుకింతగా రిటైల్ ఎఫ్.డి.ఐలను విమర్శిస్తు...