అయ్యప్ప దీక్షలో రామ్ చరణ్
రామ్ చరణ్ తేజ్ యాక్టింగ్ డాన్స్ విషయం లోనే కాదు భక్తి విషయంలో కూడా నాన్న మెగాస్టార్ బాటలోనే నడుస్తున్నాడు. ఒక పక్క రచ్చ షూటింగ్ లో పాల్గొంటూనే మరో పక్క అయ్యప్ప దీక్ష కొనసాగిస్తున్నాడు. దీక్ష 41 రోజులపాటు సాగుతుంది. మెగాస్టార్ బాటలోనే ఇప్పుడు మగధీరుడు నడుస్తున్నాడు. నటనలోనేకాకుండా భక్తి చింతనలోకూడా వారసుడనిపించు కుంటున్నాడు చెర్రీ. అయ్యప్పమాల దీక్షని ఎంతో నిష్టతో చేయాలి. అయ్యప్ప దీక్షని చేప్పట్టడం అంటే మామూలు విషయం కాదు. మనసుని పూర్తిగా దేవుడిపై లగ్నం చేయాలి. దీక్షా సమయంలో ఎలాంటి వాంఛలు మనసులోకి రాకూడదు. ఉదయం నాలుగ్గంటలకే నిద్రలేవాలి.. పూర్తిగా దైవ చింతనలో గడపాలి. తమ పనులు తామే చేసుకోవాలి. అందుకే అయ్యప్ప దీక్షలు చేపట్టిన వారిని అందరూ ఎంతో గౌరవిస్తారు. సాక్షాత్తూ ఆ అయ్యప్ప దేవుడే అన్నట్టు పాదాభివందనం చేస్తాడు. ఇంతటి పవిత్రమైన అయ్యప్ప దీక్షని రామ్‌చరణ్‌తేజ్ చేయాలన్న ఆలోచన రావడమే గొప్పతనం.. సో.. అయ్యప్ప దీక్షని దిగ్విజయంగా పూర్తి చేసి ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలని రాంచరణ్ అందుకోవాలని మన...