నెలవారి ఖర్చు అక్షరాలా 25 లక్షలు..!
ప్రఖ్యాత సినీనటి.. ఒకనాటి గ్లామర్ తార శ్రీదేవీ.. తన భర్త, ప్రముఖ నిర్మాత అయిన బోనీ కపూర్ ఆర్థిక కష్టాల్లో పడ్డారా అంటూ.. కథనాలు వస్తున్నాయి. బోనీకపూర్ సినిమాలు తీయడం మానుకుని ఒక టీవీ ఛానెల్ హెడ్ గా.. ఉద్యోగంలో చేరబోతున్నారన్న వార్త సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 56 ఏళ్ల వయస్సులో ఉన్న బోనీ కపూర్.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై చర్చ నడుస్తోంది. బోనీ కపూర్ గతంలో తీసిని నో ఎంట్రీ, వాంటెడ్ వంటి సినిమాలు మంచి రాబడినే ఇచ్చినప్పటికీ.. ఆతర్వాత తీసిన రెండు సినిమాలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారని.. చెబుతున్నారు. ప్రత్యేకించి జెనీలియా, అర్మన్ బవేజాలతో తీస్తున్న సినిమా పూర్తి కాకపోవడంతో.. ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ దశలో అప్పులు తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఒక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కు హెడ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారట. ఈ పరిస్థితి రావడానికి కారణంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు సినీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీదేవీ, బోనీకపూర్ కుటుంబం నెలవారీ ఖర్చు 25 లక్షల వరకు ఉంటుందట. శ్రీదేవీ తను ధరించే దుస్తులకే భారీగా ...