పోస్ట్‌లు

t-congress leaders janareddy keshavarao ponnam prabhakar saperate telangana political news political articls political hot news tdp revanth reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పెన్నే కాదు.. గ‌న్నుకూడా ప‌ట్టుకోగ‌లం..!

చిత్రం
ఒకవేళ దాడులు చేస్తేనే.. తెలంగాణను విడిచి వెళ్తామంటే.. సీమాంధ్రులపై దాడి చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర నేతలు మమ్మల్ని రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. పయ్యా వుల వ్యాఖ్యలను తప్పుపట్టిన రేవంత్ రెడ్డి.. ఆత్మాహుతి దాడులు కాదు.. ఆత్మహత్యలు చేసుకోండని ఆయన అన్నారు. ఇకనైనా తెలంగాణను విడిచివెళ్లాలని ఆయన సీమాంధ్రులను కోరారు. లేకుంటే.. రజాకార్లపై చేసినట్లు సీమాంధ్రులపై కూడా పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే.. సీమాంధ్ర నేతలేం తక్కువ కాదన్నారు. సీమాంధ్ర నేతల్ని తరిమికొట్టడం పెద్ద పనేం కాదన్నారు. సమైక్యవాదం వినిపించే నేతలు.. సభలకు రాకుండా తరిమికొడతామన్నారు. మాకు పెన్ను పట్టుకోవడం తెలుసు.. అవసరమైతే గన్ను పట్టుకోవడమూ తెలుసంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరిగాక ఇక సీమాంధ్రులతో కలిసి ఉండే ప్రసక్తే లేదన్నారు. ఇక అసెంబ్లీని నిర్వహించే సత్తా ఎవరికి లేదని.. ఆయన అన్నారు.