పోస్ట్‌లు

chiranjeevi railway minister shiping minister congress prajarajyam party prp soniagandhi mamata belarji trunamool manmohan singh లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చిరంజీవికి ప‌ద‌వి రాష్ట్రంలోనా? కేంద్రం లోనా?

చిత్రం
 చిరంజీవికి కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు వ‌చ్చేసింద‌ని, త్వ‌ర‌లోనే మంత్రి గా బాధ్య‌త‌లు తీసుకోబోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌ల‌లో నిజంలేద‌ని తేలిపోయింది. చిరంజీవికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటే ముందు చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. రాజ్య‌స‌భ కి ఎపిలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో స‌మ‌స్య వ‌స్తోంది.. అందుకే చిరంజీవికి కేంద్రంలో కాకుండా రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చోటు ఇస్తే ఎలా ఉంటుంద‌న్న కోణంలో కూడా అధిష్టానం ఆలోచ‌న ఉంద‌న్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వరిస్తానని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులకు చిరంజీవి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సి. రామచంద్రయ్య, అనిల్, గంటా శ్రీనివాస రావు పేర్లను ఆయన మంత్రి పదవుల కోసం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధర రావు, వేదవ్యాస్ కూడా అందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ప్రజారాజ్యం నుంచి వచ్చిన ముగ్గురు నాయకులకు డిసిసి పదవులు ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు...

రైల్వే శాఖ‌పై చిరంజీవి చూపు…!

చిత్రం
చిరంజీవికి కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానం దాదాపు ఖాయ‌మైపో యింద‌ని, ఆయ‌న‌కి షిప్పింగ్ శాఖ ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే చిరంజీవి షిప్పింగ్ శాఖ కంటే రైల్వే శాఖ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌రుస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌మ‌తా బెన‌ర్జీ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్ట‌డంతో ఆమె నిర్వ‌హించిన రైల్వే శాఖ ప్ర‌స్తుతం ఖాళీగా ఉంది. అయితే రైల్వే శాఖను తృణమూల్ కాంగ్రెసుకే ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకుద‌ని. మమతా బెనర్జీ కూడా అదే కోరుతున్నార‌ని, అందువల్ల రైల్వే శాఖ చిరంజీవికి ఇవ్వడం కుదరనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తొలిసారి మంత్రి పదవి చేపడుతున్న చిరంజీవికి కీలకమైన శాఖ ఇస్తే ఇబ్బందులు ఎదురు కావచ్చునని అనుకుంటోంది ఈ ప‌రిస్థితిలో చిరంజీవి జ‌రుపుతున్న లాబీయింగ్‌ని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కి చిరంజీవి స‌పోర్ట్ ఎంత‌వ‌ర‌కు బ‌లం చేకూరుతుందో అన్న‌దాన్ని బ‌ట్టి  చిరంజీవికి రైల్వే శాఖ కేటాయించ‌డంపై కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అన్న‌ది వేచిచూడాలి.