పోస్ట్‌లు

srivari brahmotsavaalu tirumala brahmotsavaalu -2011 brahmotsavaalu - 2011 tirupati venkateshwara swamy tirumala balaji namo venkatesh devotional news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఘ‌నంగా శ్రీ‌వారి గ‌రుడ‌వాహ‌న ఊరేగింపు

చిత్రం
శ్రీవెంకటేశ్వరుడు సోమ‌వారం రాత్రి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. పూల దండలతో అద్వితీయంగా అలంకరించిన స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. ల‌క్ష‌లాధిమంది భ‌క్తులు ఈ గ‌రుడ‌వాహ‌న ఊరేగింపుకు హాజ‌రయ్యారు. తిరుమాడ‌వీధులు గోవింద‌నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగాయి. శ్రీ‌వారు గ‌రుడ‌వాహ‌నంపై ఊరేగించే అద్భుత‌మైన దృశ్యాన్ని క‌న్నులారా వీక్షించ‌డానికి భ‌క్తులు పోటెత్తారు. గ‌రుడ‌వామ‌నంపై శ్రీ‌వారి ఊరేగింపును చూడ‌డం అన్న‌ది త‌మ పూర్వ జ‌న్మ సుకృతం అని కొంద‌రు భ‌క్తులు తెలిపారు. అద్యంత భ‌క్తి భావంతో తిరుమాడదుల‌న్నీ పుల‌కించిపోయాయి. ల‌క్ష‌లాది మంది భ‌క్తుల స‌మ‌క్షంలో జ‌రిగిన శ్రీ‌వారి గ‌రుడ‌వాహ‌న ఊరేగింపులో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, అధికారులు డ్యాన్స్ చేశారు. బాపిరాజు స్టెప్పులు వేయడంతోపాటు డప్పు కూడా మోగించారు.