చిరంజీవికి దాసరితో చెక్ పెట్టడానికేనా..?
రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలవడం కాంగ్రెస్ వర్గాలలు ఆసక్తిని రేకెత్తించింది.కాంగ్రెస్ లో వర్గ విబేధాలు లేకుండా చూసుకోవడానికా, లేక కిరణ్ తన సొంత వర్గాన్ని పెంచుకోవడానికా అన్న చర్చ జరుగుతోంది. విశేషమే మిటంటే ఆయా పత్రికలు వీటిపై ప్రత్యేక కధనాలు ఇచ్చాయి. కిరణ్, దాసరిల కలయికపై సాక్షి,ఈనాడు ఒకే తరహాలో కధనాలు ఇవ్వడం విశేషం.ఈ రెండు పత్రిలలోకూడా మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్ధి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినందుకే దానికి ప్రతిగా కిరణ్ కుమార్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి సరిపడని దాసరి నారాయణరావుతో బేటి అయి తన సమాధానం చెప్పారని కధనాలు ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ నేతలు కొందరు మాత్రం కాంగ్రెస్ లో ఐక్యత అవసరమని, కిరణ్ తో పడని వారిని కలపుకుని వెళ్లడానికి బొత్స, చిరంజీవి వంటివారు. అలాగే బొత్స, చిరంజీవి లకు పడని నేతలను కిరణ్ కలిసి ఏకతా రాగం వినిపించడానికే ఈ యత్నం అని చెబుతున్నారు. కాని దానికన్నా పోటాపోటీ రాజకీయాలలో ఎవరికి తమదే పైచేయి అనిపించుకోవ...