పోస్ట్‌లు

nagarjuna naga chaitanya ramgopal varma raghavendra rao dada josh telugu movies movie news movie interviews movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నాగార్జున స‌క్సెస్ ఫార్ములా నాట్ వ‌ర్కింగ్‌..?

చిత్రం
నాగార్జున కెరీర్‌ని మ‌నం ప‌రిశీల‌న‌గా గ‌మ‌నిస్తే.. ఆయ‌న స‌క్సెస్ అయిన చిత్రాల ద‌ర్శ‌కులు దాదాపుగా అంద‌రూ కొత్త‌వారే ఉంటారు. ఆయ‌న ఇంట్ర‌డ్యూస్ చేసిన ద‌ర్శ‌కులు త‌మ టాలెంట్‌తో నాగార్జున‌ని టాప్ రేంజ్‌లో నిల‌బెట్టారు. అయితే ఇప్పుడు ఇదే స‌క్సెస్ ఫార్ములాతో నాగార్జున నిండా చేతులు కాల్చుకుంటున్నాడ‌నిపిస్తోంది. తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన నాగార్జున..  కొత్త దర్శకుల ఎంపికలో మంచి ముందు చూపు ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున సినిమాల ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చౌదరి, దశరథ్, లారెన్స్ మంచి దర్శకులుగా ఎదిగారు. అయితే రానురాను నాగార్జునలో ముందు చూపు పవర్ తగ్గుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాదు త‌న కుమారుడు నాగ‌చైత‌న్య కెరీర్‌ని కూడా పాడుచేస్తున్న‌ట్ట‌నిపిస్తోంది.  తన గత సినిమా కేడి గమనించినా, తన తనయుడు నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్, దడ సినిమాలు పరాజయం పాలైన విషయం పరిశీలించినా ఈ విషయం స్పష్టం అవుతోంది. జోష్ సినిమాఃను వాసువర్మ, కేడి మూవీని కిరణ్, దడ చిత్రాన్ని అజయ్ భూ...