మూడు కోట్లు, ముఫ్ఫై కిలోల బంగారం
కర్నాటక మాజీ మంత్రి , ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధనరెడ్డి ఇంటిలో సిబిఐ సోదాలు చేసినప్పుడు మూడు కోట్ల నగదు, ముప్పై కిలోల బంగారం దొరికింది.అలాగే కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇంటిలో కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు.గాలి జనార్దనరెడ్డి గతంలో తిరుమల శ్రీవెంకటేశ్వరునికి సుమారు నలభై కోట్ల విలువైన కిరీటాన్ని సమర్పించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఆలయానికి పది కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు. వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన గాలి కుటుంబం ఇంతకాలం బళ్లారిలో ఎదురు లేకుండా ఉంటోంది. ఈయనకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ కు చెందిన మరో గనుల యజమాని అనిల్ లాడ్ పై కూడా అభియోగాలు ఉన్నాయి. గాలి జనార్దనరెడ్డితోపాటు మిగిలిన పార్టీలకు చెందిన వారిపై కూడా దాడులు చేస్తే అప్పుడు సిబిఐ పై రాజకీయ విమర్శలు ఉండకపోవచ్చు. అలాకాకపోతే దీనికి రాజకీయ రూపం వచ్చే ప్రమాదం ఉంది.