పోస్ట్‌లు

yerram naidu tdp congress trs telangana samaikhyandhra jai telangana political news political articls hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాజీనామాలు ఆమోదిస్తే.. అంతే..!

చిత్రం
తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందుతాయా? అన్న చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ లో ఈ విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కేవలం ఫాక్స్ ద్వారానే తమ రాజీనామా లేఖలు పంపారు కనుక పెద్దగా ఇబ్బంది ఉండదు. వారు మళ్లీ స్వయంగా వచ్చి రాజీనామాలు సమర్పించడమో, లేక స్పీకర్ ను కలిసి రాజీనామాల గురించి చెప్పడమో జరిగే వరకు పట్టించుకోనవసరం లేదు. కాని నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి, జోగు రామన్నలు స్వయంగా వచ్చి స్పీకర్ కార్యాలయానికి మళ్లీ రాజీనామా లేఖలు అందించారు. వీటిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. పైగా స్పీకర్ కిందటిసారి తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలను సామూహికంగా తిరస్కరించిన తర్వాత, నాగం జనార్ధనరెడ్డికి తన పి.ఎస్. ద్వారా ఫోన్ చేయించి మళ్లీ రాజీనామా లేఖ ఇస్తే ఆమోదిస్తామని చెప్పించారు.అందువల్ల అది కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య అల్లా తెలంగాణ కు సంబందించి కొందరు ఎమ్మెల్యేల ర...

టిడిపిని చీల్చ‌డానికి కుట్ర జ‌రుగుతోంది..

చిత్రం
తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె.ఎర్రన్నాయుడు ఆరోపించారు.ఢిల్లీ నేతలకు చంద్రబాబే ఎప్పుడూ కలలోకి వస్తాడని, ఆయనను దెబ్బతీయడానికి ఉత్తరాది నాయకులు రాష్ట్రాన్ని చీల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం చీలిపోతే ఆంద్రప్రదేశ్ గుర్తింపు ఉండదని, చిన్న రాష్ట్రంగా మారితే ఉత్తరాది వారికి ఎదురు ఉండదని, అందుకే ఈ చీలిక కుట్ర అని ఎర్రన్నాయుడు ఆయన అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఈసమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని కూడా ఎర్రన్నాయుడు డిమాండు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై దమ్ముంటే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ సీమాంద్ర నేతల సదస్సు సవాలు చేసింది. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ శాసనసభలో కనుక తీర్మానంపై రహస్య ఓటింగ్ పెడితే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే అభిప్రాయమే వస్తుందని ఆయన అన్నారు.కాగా మరో నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ, ఆంధ్రులు కర్నూలు రాజధానిని త్యాగం చేశారని, అలాగే గుంటూరులో హైకోర్టు త్యాగ...