మంత్రి శంకరరావుకి ప్రాణహాని..
వై.ఎస్.జగన్ ఆస్తుల కేసుకు ప్రధాన కారకుడు అయిన మంత్రి డాక్టర్ శంకరరావు తనకు భద్రత కొరవడిందని వాపోతు న్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చివరి లేఖ రాస్తు న్నానని, తనకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తనకు , తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని ఆయన అన్నారు. జగన్ ఆస్తులపై విచారణ కోరుతూ లేఖ రాసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. తనకు బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఏర్పాటు చేసి, భద్రత ఇంకా పెంచాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. విశేషం ఏమిటంటే ఇదే చివరి లేఖ అని ముఖ్యమంత్రిని మంత్రి శంకరరావు హెచ్చరించడం. మరి ముఖ్యమంత్రి ఈయనకు బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఇచ్చి భద్రత పెంచుతారా అన్నది చూడాలి.శంకరరావు తన లేఖను ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి కి కూడా లేఖ రాయడం కూడా గమనించదగిన అంశం.