పోస్ట్‌లు

annahazare tihar jailu hazare anna soniagandhi lokapal bill annahazare send to tihar jail hot news hot articls chandrababu naidu Bhopal Aug 16 An anti-corruption Shehla Masood police firing. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అన్నా హజారే.. నీకు నా జోహారే..!

చిత్రం
అన్నా హజారే.. నీకు నా జోహారే..! అవినీతిపై సమర శంఖం పూరించారే.. యువ శక్తిలో ఆవేశపు జ్వాల రగిలించారే..! ఒక ప్రభంజనంలా ముందుకు సాగును ఇక నీ పోరే.. యావద్భారతం ఏకమై నీ వెనకే చేరే.. అన్నా హజారే..! అందరి నోళ్ళలో నానుతోంది ఇప్పుడు నీ పేరే.. నిస్వార్థపు నీ దీక్షా దక్షతకి అందరూ జీ హుజూరే.. అన్నా హజారే.. నీకు నా జోహారే..! -చెడుదీపు సంతోష్ కృష్ణ santoshkrishnach@gmail.com

అవినీతి పోరాటంలో ఒక‌రు బ‌లి..!

చిత్రం
అన్నా హ‌జారే దీక్ష‌ని పోలీసులు భ‌గ్నం చేయ‌డం, కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌కీయ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించి అన్నా హ‌జారేను క‌ట‌క‌టాల పాలు చేయ‌డంతో దేశం ఒక్క‌సారిగా అన్నా హ‌జారేకు మ‌ద్ద‌తుగా ముందుకు సాగుతోంది. ప్రాంతాలు, మ‌తాల‌క‌తీతంగా అవినీతిపై స‌మ‌ర‌శంఖం పూరించింది. ఈ అవినీతి పోరాటంలో పోలీసుల తూటాల‌కి ఓ వ్య‌క్తి బ‌ల‌వ్వ‌డం ఎంతో బాధాక‌రం.  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అన్నాహజారే మద్దతుదారుడిని పోలీసులు కాల్చి చంపి చ‌పారు. షీలామసూద్ అనే వ్యక్తిపైపోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి చంపినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌తో అవినీతి వ్య‌తిరేక పోరాటం కోసం చేస్తున్న అన్నా హ‌జారేకి మ‌రింత మ‌ద్ద‌తు ల‌భించ‌డ‌మే కాదు.. కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై నిర‌స‌న‌వెలువెత్తుతంది. మ‌రి.. ఈ ప‌రిణామాలు ఎలాంటి ప‌రిస్థితుల‌కి దారితీస్తాయో…