పోస్ట్‌లు

maheshbabu poorijagannath kajal tollywood movies tollywood news cine gossips bollywood news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రిన్స్ వేగాన్ని అందిపుచ్చుకుంటున్నాడు..

చిత్రం
ఒక్కో సినిమాకి రెండు మూడు సంవ‌త్స‌రాల కాలం తీసుకుంటూ తాపీగా ముందుకు వెళుతున్న మ‌హేష్ బాబు ఇక‌నుండి స్పీడ‌ప్ అవ్వ‌బోతున్నాడు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి సినిమా షూటింగ్ జ‌రుపుకుని అభిమానుల‌ని క‌ళ్ళు కాయ‌లు కాసేలా చేసే మ‌హేష్‌బాబు ఎట్ట‌కేల‌కు రెగ్య‌ల‌ర్ షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు.  ప్రిన్స్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం – ది బిజినెస్ మెన్-. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై డా. వెంకట్ నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్ జులైలో ప్రారంభం అయ్యి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనుంది. బిజినెస్ మెన్ గా ప్రిన్స్ మహేష్ ఒక పవర్ ఫుల్ రోల్ ని పోషించనున్నారు. – గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్ – అనే సరికొత్త కాప్షన్ తో పూరి ఈ చిత్రానికి మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. ది బిజినెస్ మెన్ లో తొలిసారిగా కాజల్ ప్రిన్స్ సరసన సందడి చేయ్యనుంది. టాలీవుడ్ రికార్డులని మరోసారి ఈ చిత్రం తిరగరాస్తుందని అందరూ ఆశిస్తున్నారు.