పోస్ట్‌లు

madata kaja allari naresh sneha ullal comedy movies comedy films tollywood movies movie reviews movie news movie gossips allari naresh 3d movie లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

3డి సినిమాలో అల్లరి న‌రేష్‌

చిత్రం
కామెడీ చిత్రాల హీరోగా పేరు సంపాదించుకున్న అల్లరి న‌రేష్ త్వర‌లో ఓ 3డి చిత్రంలో న‌టించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బిందాస్, అహ నా పెళ్లంట చిత్రాలను నిర్మించి, ఇటీవల విడుదలైన ‘దూకుడు’కి ఓ నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర నిర్మిస్తున్నట్టు స‌మాచారం.పక్కా సోషల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నలుగురు హీరోలుంటారు. ఆ నలుగురిలో అల్లరి నరేష్ ప్రధాన భూమిక పోషించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం మంచి కథ సిద్ధం చేశామని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తామని నిర్మాత పేర్కొన్నారు.