పోస్ట్‌లు

bapu nayanataara srirama rajyam balakrishna tollywood movies movie reviews movie news cine gossips hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

న‌య‌న‌కి బాపు బ‌హుమ‌తి..

చిత్రం
మన తెలుగువారికి గొప్పవరం బాపు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి బాపు తన స్వహస్తాలతో వేసిన పెయింటింగ్ ఇస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. సరిగ్గా అలాంటి అనుభూతే ప్రముఖ సినీ తార నయనయన తారకు దక్కింది. శ్రీరామరాజ్యం షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సీత పాత్రధారి అయిన నయనతార బావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయిన సన్నివేశం అందరికి తెలిసిందే. సీత పాత్రను ఆమె ఎంతో పవిత్రంగా భావించి అదే తరహాలో వ్యవహరించారట. ఆ షూటింగ్ సమయంలో ఆమె ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాపును ఒక కోర్కె కోరారు. బాపు స్వయంగా ఒక చిత్రం గీసి ఇవ్వాలని ఆమె అడిగారు. ఆయన అందుకు అంగీకరించి తన పుస్తకం ఇచ్చి ఏ చిత్రం కావాలో కోరుకోమన్నారు. అందుకు నయనతార మీరు ఏది ఇచ్చినా సంతోషమే అన్నారు. ఆ మీదట బాపు ఒక రోజు నయనతారకు ఒక బహుమతిని అందించారు. అది అందమైన పెయింటింగ్. అది కూడా ఆమె కోరుకున్న పెద్ద చిత్రం. సీత స్వయంవరం నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు ఉండే దృశ్యాలను ఆయన చిత్రీకరించి ఇచ్చేసరికి నయనతార ధ్రిల్ అయిపోయారు ఆమె ఆనందానికి హద్దులు లేవంటే ఆశ్చర్యం కాదు. అలాగే శ్రీరామరాజ్యం నిర్మాత కూడా సినిమా వర్కింగ్ స్టిల్స్ ...