న‌య‌న‌కి బాపు బ‌హుమ‌తి..

మన తెలుగువారికి గొప్పవరం బాపు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి బాపు తన స్వహస్తాలతో వేసిన పెయింటింగ్ ఇస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. సరిగ్గా అలాంటి అనుభూతే ప్రముఖ సినీ తార నయనయన తారకు దక్కింది. శ్రీరామరాజ్యం షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సీత పాత్రధారి అయిన నయనతార బావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయిన సన్నివేశం అందరికి తెలిసిందే. సీత పాత్రను ఆమె ఎంతో పవిత్రంగా భావించి అదే తరహాలో వ్యవహరించారట. ఆ షూటింగ్ సమయంలో ఆమె ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాపును ఒక కోర్కె కోరారు. బాపు స్వయంగా ఒక చిత్రం గీసి ఇవ్వాలని ఆమె అడిగారు. ఆయన అందుకు అంగీకరించి తన పుస్తకం ఇచ్చి ఏ చిత్రం కావాలో కోరుకోమన్నారు. అందుకు నయనతార మీరు ఏది ఇచ్చినా సంతోషమే అన్నారు. ఆ మీదట బాపు ఒక రోజు నయనతారకు ఒక బహుమతిని అందించారు. అది అందమైన పెయింటింగ్. అది కూడా ఆమె కోరుకున్న పెద్ద చిత్రం. సీత స్వయంవరం నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు ఉండే దృశ్యాలను ఆయన చిత్రీకరించి ఇచ్చేసరికి నయనతార ధ్రిల్ అయిపోయారు ఆమె ఆనందానికి హద్దులు లేవంటే ఆశ్చర్యం కాదు. అలాగే శ్రీరామరాజ్యం నిర్మాత కూడా సినిమా వర్కింగ్ స్టిల్స్ తో ఆల్బమ్ ఇవ్వడం కూడా ఆమె సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. అయితే తాను సినిమాలలో ఇకపై నటించనని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించడం ద్వారా తానేమీ సినీరంగం నుంచి తప్పుకోవడం లేదని తేల్చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!