హైద‌రాబాద్ ఎవ‌రిది..?


హైదరాబాద్ ఎవరిది.. పెట్టుబడులు పెట్టినవాళ్లదా, లేక ఇక్కడున్నవాళ్లదా.. లేక తెలంగాణకు చెందినదా.. వీటన్నిం టిపై ఓ ప్రత్యేక కథనాన్ని తెహల్కా పత్రిక ప్రచురిం చింది. ఇన్నాళ్లూ సీమాంధ్రలు హైదరాబాద్ ను అభివృద్ది చేశాం.. కోట్ల పెట్టుబడులు పెట్టాం అందుకే హైదరాబాద్ అందరిదీ అంటున్నారు. రాష్ట్ర విభజనపై కూడా ఇదే హైదరాబాదే కీలకంగా మారింది. రోజూవారి కూలీ దగ్గర నుంచి వేల కోట్లు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తల వరకు హైదరాబాద్ కీలకంగా మారింది. అయితే ఆసక్తికరమైన విషయమేం టంటే.. పెట్టుబడుల్లో రాజకీయనేతలుగా మారిన పారిశ్రామిక వేత్తలున్నారు.. అలాగే పారిశ్రామికవేత్తలుగా మారిన రాజకీ యనేతలున్నారు. అంతెందుకు ఆదివారం కూడా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ను డెవలప్ చేసింది తామె అని చెప్పుకొచ్చారు. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి డెవలప్ చేశాం కాబట్టి.. హైదరాబాద్ పై అన్ని హక్కులు తమకుంటాయన్నారు. మరి పారిశ్రామికవేత్తలు ఎంత పెట్టుబడులు పెట్టారు.. రాజకీయనేతలు ఎంతపెట్టుబడులు పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై పత్రికా కథనం ప్రకారం.. హైదరాబాద్ లో లగడపాటి ల్యాంక్ హిల్స్ ప్రాజెక్టులో దాదాపు 5 వేల 500 కోట్ల పెట్టుబడులున్నాయి. అలాగే టీ సుబ్బిరామిరెడ్డికి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 4 వేల 900 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ లింక్ కెనాల్, హైదరాబాద్ – కరీంనగర్ – రామగుండ ఫోర్ లైన్ రహదారి పనులు, పటాన్ చెరువు – శామీర్ పేట ఎనమిది లైన్ల ఎక్స్ ప్రెస్ హైవే పనులను సుబ్బిరామిరెడ్డికి చెందిన కంపెనీలు చేపట్టాయి. అలాగే గుంటూరు ఎంపీ రాయపాటి కూడా దాదాపు 487 కోట్లకు పైగా పెట్టుబడులున్నాయి. అలాగే హైదరాబాద్ శివార్లలో 8 లైన్ల హైవే పనులు చేస్తున్న కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ అధినేత మేకపాటి బ్రదర్స్ కు హైదరాబాద్ తో దాదాపు 800 కోట్ల పెట్టుబడులు ముడిపడిఉన్నాయి. ఇక రాంకీ గ్రూప్ అధినేత తెలుగుదేశం లీడర్ మోదుగుల వేణుగోపాల రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు పనులు, రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న డిస్కవరి సిటీలతో కలిపి.. 6300 కోట్ల పెట్టుబడులున్నాయి. అంతేకాదు.. ఇదే హైదరాబాద్ లో తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారు. పెద్దపల్లి ఎంపీ వివేకానంద.. కూడా దాదాపు 518 కోట్ల పెట్టుబడులున్నాయి. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా.. సుశీ హైటెక్ గ్రూప్ పేరుతో 228 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇలా వేల కోట్లతో ముడిపడి ఉన్న పారిశ్రామికవేత్తలదా హైదరాబాద్.. లేక ఇవే కంపెనీల్లో రోజూ వారీ పనులు చేస్తున్న కూలీలదా.. లేక భౌగోలికంగా తెలంగాణలో ఉంది కాబట్టి.. తెలంగాణదా.. ? ఏదేమైనా.. రాష్ట్ర విభజన జరిగితే.. హైదరాబాదే కీలకంగా మారిన విషయం సుస్పష్టం.
source:kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!