వాళ్ళ మ‌ధ్య చ‌ర్చ‌లు లేన‌ట్టే..!

కృష్ణా జిల్లాలో మంత్రి కె.పార్ధసారధి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. జిల్లాలో ఇసుక రీచ్ ల కుంభకోణం, ఇతర అంశాపై ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సవాలు విసురుకు న్నారు.విజయవాడ పక్కన ఉన్న గొల్లపూడి పంచాయతీ కార్యాలయంలో ఈ చర్చ జరగాలని ఇద్దరు నేతలు భావించి అందుకు సిద్దమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రి పార్ధసారధి ఉదయానే జిల్లా వ్యాప్తంగా తన అనుచరులు ఐదువందలమందితో కలిసి గొల్లపూడి చేరుకున్నారు. ఆ తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా తన వందలాది మంది అనుచరులతో కలసి గొల్లపూడి బయల్దేరి వస్తుండగా, మద్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేతలిద్దరే కూర్చుని చర్చించుకుంటే ఒకే గాని, అనుచరులతో కలిసి చర్చలు ఆరంభిస్తే ఉద్రిక్తత ఏర్పడుతుందని భావించి ఉమామహేశ్వరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మంత్రి పార్ధసారధి కూడా ఇలా తొందరపడి అనుచరులతో చర్చలకు దిగడం ఏమిటో అర్ధం కాదు. ఒక వేళ నిజంగానే వారిద్దరూ చర్చలు జరపదలచకుంటే ఏదో ఒక సంఘం నేతల సమక్షంలో చర్చలు జరుపుకోవచ్చు. ఏది ఏమైనా ఉద్రిక్తతలు పెరిగే విదంగా ఇద్దరు నేతలు వ్యవహరించడం సరికాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!