పోస్ట్‌లు

london violance international news london London violence raises 2012 Olympic concerns. international news hot news hot toppics sensational news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

లండ‌న్‌లో నైతిక విలువ‌లు శూన్యం

చిత్రం
ఇప్పుడు బ్రిటన్ లో పిల్లల పెంపకంపై ప్రభుత్వ దృష్టి పడింది. పిల్లలను సరిగా పెంచకపోవడం వల్లనే ఇటీవలి లండన్ హింసా కాండ చెలరేగిందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ అభిప్రాయపడుతున్నారు.ఒక వ్యక్తిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారన్న వివాదం పెరిగి చివరికి లూటీలు, ఆస్తుల దహనాలకు దారితీసింది. అయితే ఆ ఘటన సాకుతో కొందరు హింసకు పాల్పడ్డారన్నది ప్రధాని అభిప్రాయం. పిల్లలను సరిగా పెంచి, చదువులు చెప్పి ఉంటే ఇలా దోపిడీలకు పాల్పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. ఆయా షాపులపై లూటి చేసినవారు పెద్ద,పెద్ద టీవీలు ఎత్తుకువెళ్లిన దృశ్యాలు పలుచోట్లు రికార్డు అయ్యాయి.పేదరికానికి,ఈ దోపిడీలకు సంబంధం లేదని ఈ సన్నివేశాలు తెలియచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ప్రవర్తన ఉండేలా నేర్పవలసిన అవసరం ఉందని ఈ ఘటనలు తెలియచెప్పాయని ఆయన అన్నారు.ఈ దోపిడీ, హింసాకాండలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.అయితే యూరప్ సమాజంలో ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రుల సంబంధ బాంధవ్యాలపై చర్చకు ఈ ఘటనలు తెరలేపాయి.చిన్న,చిన్న విషయాలకు విడాకులు తీసుకోవడం,పి...

అల్లర్లతో అట్టుడికిన లండ‌న్‌

చిత్రం
ప్రభుత్వ వ్యయంలో కోత విధించడానికి, 2015 నాటికి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలపై కోత విధిస్తారని ఆరోపిస్తూ లండ‌న్‌లో కొంద‌రు అల్లరి మూక‌లు చేస్తున్న హింస సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఓ నల్లజాతీయుడి ఎన్‌కౌంటర్‌తో ఈ అల్లర్లు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అల్లర్లను అదుపు చేయడం ప్రధాని కామెరూన్‌కు అగ్నిపరీక్షగా మారింది. ఇప్పటి వరకు 450 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు రోజులుగా లండన్ నగరం హింస, లూటీలతో అట్టుడికిపోతోంది. లండన్‌లో ప్రారంభమైన అల్లర్లు మరో మూడు ప్రధాన నగరాలకు కూడా వ్యాపించాయి. బ్రిటన్‌లో 1980 తర్వాత ఇంతటి అల్లర్లు చెలరేగడం ఇదే ప్రథమం. అల్లరి మూకలు లండన్‌లో భవనాలకు, వాహనాలకు, చెత్త కుప్పలకు నిప్పు అంటిస్తూ వెళ్లిపోయారు. పోలీసు అధికారులపైకి బాటిళ్లు, ఫైర్ వర్క్స్ రువ్వుతూ దుకాణాలను లూటీ చేస్తూ పోతున్నారు. వేసవిలో 2012 కామన్‌వెల్త్ క్రీడలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.