పోస్ట్‌లు

toli ekadashi shayana ekadashi maha vishnuvu yedukondala vadu vaikunta ekadashi srinivasudu shayana ekadashi venkateshwara swamy sri balaji padmanabha swamy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తొలి ఏకాద‌శి విశిష్టత (పార్ట్ – 2)

చిత్రం
తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసు రునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణు వు, సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే “ఏకాదశి” అనీ, ఆమె మూడు వరాలు… 1. సదా మీకు ప్రియముగా ఉండాలి. 2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి. 3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి. అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి ఉన్నాయి. మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఐతే, అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు… * దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. * ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. * అసత్య మాడరాదు. * స్త్రీ సాంగత్యం పనికి రాదు. * కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. * ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. * మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అన...