నేడు ప్రపంచ డయాబెటిస్ డే
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ చేరిపోయింది. చాలా సైలెంట్ గా మనిషి నవనాడులు క్రుంగదీస్తున్న మధుమేహ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం ప్రతి ఏటా నవంబర్ 14న అంటే ఇదే రోజున ప్రపంచ డయాబెటిస్ అవగాహనా దినం పాటిస్తున్నారు. చిన్నారుల దగ్గర్నించి పెద్దవాళ్లవరకూ అందర్నీ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. దీన్నే డయాబెటిస్ మెల్లిటస్ అని అంటుంటారు. డయాబెటిస్ పై ప్రపంచమంతటా అవగాహరన కలిగించడంకోసమే ప్రతిఏటా నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ అవగాహన దినం పాటిస్తున్నారు. 1991 నుంచి ప్రపంచ డయాబెటిస్ అవగాహన దినాన్ని జరుపుకుంటూ డయాబెటిస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావడం ప్రారంభించారు. 2007లో దీనిపై ఐక్యరాజ్యసమితి సాధికారిక గుర్తింపునిచ్చింది. దాదాపు 160 దేశాల్లో పాటిస్తున్న డయాబెటిస్ అవగాహన దినం మధుమేహం వ్యాధిపై అవగాహన పెంపొందించి, భయాలు పోగట్టడానికి అనేక దేశాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం వేలాది స్వచ్చంధ సంస్థలు ఇదే రోజున డయాబెటిక్ రన్, వాక్ సైకిల్ రేస్ వంటివి నిర్వహిస్తున్నార...