ప్రశాంతి నిలయం మిస్టరీ ని చేధించేది ఎవరు ???
ప్రశాంతి నిలయం కార్య కలాపాలపై మొదటి నుంచి సందేహాలే.. బాబా మరణం ఇంకా మిస్టరీ ఇక ప్రశాంతి నిలయం నుంచి సొమ్ము, ఆభరణాలు తరలి పోవడం, మరో మిస్టరీ సొమ్ము , బంగారం తరలి పోతుందని మీడియా కోడై కూసినా ఎవరుపట్టించుకోరు , ఇదొక మిస్టరీ బాబా చని పోక ముందు చనిపోయిన తర్వాత ఇంకెంత సొమ్ము గల్లంతు అయిందో ఆ దేవుడికే తెలియాలి . అసలు యజుర్వేద మందిరం లో ఎందుకు దాచారనేది సమాధానం లేని ప్రశ్న. భక్తులు వివిధ కార్యక్రమాల కోసం ఇచ్చిన సొమ్మును బ్యాంకు లో జమ చేయాలి గదా?? శనివారం నాకాబందీలో దొరికిన రూ.35 లక్షలు ట్రస్టుకు చెందినవే అని అనంతపురం జిల్లా ఎస్పీ చెబుతుంటే ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రత్నాకర్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ డబ్బు మాది కాదు’ అని చెప్పేందుకు ట్రస్టుకు 24 గంటలు ఎందుకు పట్టింది? ఆ సొమ్ముకు 12 మంది సొంతదారులున్నారని చెప్పిన రత్నాకర్… వారి పేర్లు ఎందుకు బయట పెట్టలేదు? ఆ సొమ్ము ఎవరిదో ఆయనకు ఎలా తెలుసు? నిజంగా ఆ డబ్బు ఎవరిదో అయితే… వారు ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ డ్రైవర్ చేత ఎందుకు తరలిస్తారు? అంతా మిస్టరీ...