పోస్ట్‌లు

Ys. jaganmohanreddy odarpu yatra srikakulam tdp chandrababu naidu kirankumarreddy congress party. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్ ‘డ‌బుల్’ ఎటాక్‌..

చిత్రం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబునాయుడుపై వ్యూహాత్మక దాడి చేస్తున్నారు. నిజంగానే పేద ప్రజలపై మీకు ప్రేమ ఉంటే వారి సంక్షేమంపై మీకు శ్రధ్ద ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం తెలుపుతూ నోటీసు ఇవ్వాలని జగన్ డిమాండు చేశారు. రైతుల మద్దతు ధర కోసం 2200కోట్లు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ కోసం 6800 కోట్లు ఆయా సంక్షేమ కార్యక్రమాలను నిధులు కేటాయించాలని డిమాండు చేస్తూ చంద్రబాబు అవిశ్వాస నోటీసు ఇవ్వాలని ఆయన సవాలు విసిరారు.విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రను ఆయన కొనసాగిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని, మరో వైపు చంద్రబాబును ఇరుకునపెట్టే విధంగా ఆయన ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. తాను చేస్తున్నడిమాండు సరైనదని చెప్పడం కోసం ఆయా పధకాలను వివరిస్తూ, అవి సరిగా అమలు కావడం లేదని, అయినా చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదని, పైకి మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శిస్తూ తన మాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను కొనసాగిస్తూ ప్రజలను ఆకట్టుకోవడానికి జగన్ యత్నిస్తున్నారు.