పోస్ట్‌లు

sakala janula samme telangana rashtra samiti trs joint action commitee. kirankumar reddy congress party kcr chidambaram soniagandhi manmohan singh shamshabad air port t-tdp leaders లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స‌మ్మెపై కేసీఆర్ మౌనం వెనుక‌..?

చిత్రం
తెలంగాణ లో సకల జనుల సమ్మెలో పాల్గొన్న వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్కక్కటిగా విరమించుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఒక్కసారి కూడా స్పందించలేదు.దీనిపై అప్పుడే విమర్శలు కూడా ఆరంభమ య్యాయి.అయితే పార్టీలో అంతర్గత సమావేశాలలో కెసిఆర్ ఈ విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన భావాలు ఎలా ఉంటున్నాయన్నది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.టిఆర్ఎస్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కెసిఆర్ సమ్మె విరమణపై “గోడకు కొట్టుకోలేం కదా’ అని వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయాన్ని బయటకు ప్రకటించలేరు కదా అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు అన్నారు. అయితే ఇప్పటికీ కెసిఆర్ తెలంగాణపై కేంద్రం ఏదో ఒక ప్రకటన చేస్తుందని నమ్ముతున్నారని టిఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు ముడి పెట్టి అయినా కేంద్రం ప్రకటన చేస్తుందని ఆయన నమ్మారని అందువల్లనే ఉద్యోగ సంఘాలు సమ్మెను కొనసాగించాలని కోరుతూ వచ్చారని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈలోగా టీచర్ల జెఎసి తెలంగాన జెఎసితో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెళ్లడంతో ఇబ్బంది వచ్చిందని , దానిని సరిచే...

నాయ‌కులంద‌రూ పోలీస్‌స్టేష‌న్ల ల‌లో..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పొలిటికల్ జేఏసీ చేపట్టిన రైల్‌రోకో ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచే తెలంగాణ వాదులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెలు పట్టాలపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. అయితే డీజీపీ ముందుగా చెప్పిన విధంగానే నేతలను పట్టాలపై రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. హైదరాబాద్ సీతాఫల్ మండిలో రైల్‌రోకో నిర్వహిస్తున్న కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -మౌలాలిలో పట్టాలపై బైఠాయించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరె స్ట్ చేసి కీసర పీఎస్‌కు తరలించారు. - లక్డీకాపూల్‌లో రైల్‌రోకో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. -బర్కత్‌పూరలో రైల్‌రోకో పాల్గొనడానికి వెళ్తున్న టీఆర్ఎస్ నేత నాయినిని పోలీసులు అరెస్ట్ చేసి ఫలక్‌నుమ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. * మెదక్ : జిల్లాలోని అక్కన్న పేట రైల్వే స్టేషన్‌పై బైఠాయించిన మాజీ ఎమ్మెల్సీ సత ్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. -పెద్ద సంఖ్యలో అక్కన్న పేట రైల్వే స్టేషన్‌కు పాదయాత్రగా వెళ్తున్న టీఆర్ఎన్ ఎమ్మెల్యే హరీష్ రావు ...

సిఎం డ‌బ్బులు పంచాడంట‌..

చిత్రం
 ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకుగాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదమూడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామా రావు ఆరోపించారు.ఒక్కొక్కరికి పాతిక లక్షల చొప్పున ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై సిబిఐ విచారణ జరిపితే రుజువు చేస్తామని ఆయన సవాల్ చేశారు.ముఖ్యమంత్రిపై టిఆర్ఎస్ నేత చేసిన ఆరోపణ సంచలనాత్మకమైనదేనని చెప్పాలి. గత రెండు రోజులుగా సుమారు పది, పదిహేను మంది ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా, సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపధ్యంలో కెటిఆర్ ఈ ఆరోపణలు చేయడం విశేషం.కోఠిలోని మహిళా కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు.తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్న సమయంలో వారిని ప్రలోభ పెట్టడానికి సి.ఎమ్.డబ్బులిచ్చారని ఆయన ఆరోపించారు.కెటిఆర్ చెబుతున్నదానిని బట్టి డబ్బు సంగతి ఎలా ఉన్నప్పట్టికీ కిరణ్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని పరోక్షంగా చెప్పినట్లుగా కూడా భావించవచ్చు. నిజంగానే కిరణ్ ఇలా తన పార్టీ ఎమ్మెల్యేలకే డబ్బులు ఇచ్చి ఉండి, దానికి సంబ...

సిఎం తో అమీతుమీకి సిద్దప‌డ్డ టి-ఎంపీలు

చిత్రం
తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కార్యాచరణ నిర్ణయించుకున్నారు. రైల్ రకో ఆందోళనను సీరియస్ గా తీసుకుంటామని కేసులు పెట్టవలసి వస్తుందని పోలీసు శాఖ స్పష్టంగా హెచ్చరించగా , దానిని ఎదుర్కోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు రంగంలో దిగుతున్నారు. గద్వాలలో ఎమ్.పి మంధా జగన్నాదం, నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జమ్మికుంటలో పొన్నం ప్రభాకర్ , మహబూబాబాద్ లో బలరాం నాయక్ వరంగల్ లో రాజయ్య, నిజామాబాద్ లో మధుయాష్కి రైల్ రకోలో పాల్గొంటారని ప్రకటించారు.తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వంతోను, కేంద్ర ప్రభుత్వంతోను తలపడుతున్నారని బావించాలి. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్దమవుతున్నామని భావించాలి. కాగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడుగా వెళుతున్నారని, ప్రభుత్వం, పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

తెగింపు ధోర‌ణిలో సిఎం

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ యాత్ర తర్వాత కాస్త ఏది అయితే అదవుతుందన్న ధోరణికి వచ్చారని అంటున్నారు. అంతకుముందు కూడా అలాంటి భావన ఉన్నప్పట్టికీ ఇటీవల ఇది మరీ పెరిగిందని చెబుతున్నారు.తెలంగాణ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుండడం, సకల జనుల సమ్మె పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసి, సింగరేణి కార్మికులు సమ్మెలోకి దిగడం, విద్యా సంస్థలు పనిచేయకపోవడం వంటి కారణాలు బాగా చికాకు పెడుతున్నాయి. డిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కూడా సమ్మె విరమణ బాధ్యత ముఖ్యమంత్రిదేనని అనడం కూడా ఆయనకు కాస్త అసంతృప్తి కలిగించింది. అయితే ఈ నేపధ్యంలో సమ్మెకు సంబంధించి,కొన్ని రంగాలలోనైనా గట్టిగా వ్యవహరించాలని, ఏదైతే అది అవుతుందని ఆయన భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం ఉంటాం.లేకుంటే లేదు. అంతేకాని చేసినంతకాలం గట్టిగా చేద్దాం అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఒకపక్క తెలంగాణ మంత్రులు బాధ్యతలు నిర్వహించడంలేదు. తెలంగాణ ఎమ్.పిలు కొందరు తరచూ ఢిల్లీలో తనపై ఫిర్యాదులు చేస్తుండడమే...

రైల్‌రోకో మ‌ళ్ళీ వాయిదా..!

తెలంగాణ జెఎసి ఈనెల పన్నెండో తేదీన తలపెట్టిన రైల్ రకో వాయిదా పడే అవకాశం కనబడుతోంది.బాన్స్ వాడ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈసారి రైల్ రకోను ఈనెల పదిహేను కు వాయిదా వేయాలని జెఎసి భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ జెఎసి నాయకత్వం సమావేశమై దీనిపై చర్చ జరుపుతోంది. బాన్స్ వాడ ఉప ఎన్నిక ఈ నెల పదమూడువ తేదీన జరగనుంది. ఈ నేపధ్యంలో దీనిని వాయిదా వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి అంటే తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు రైల్ రకో చేయాలని భావించి , దానిని పన్నెండో తేదీకి వాయిదా వేశారు.తిరిగి దీనిని పదిహేనో తేదీకి దాదాపు వాయిదా వేసినట్లేనని చెబుతున్నారు.కాగా ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట రైలు పట్టా పీకివేయడంతో గూడ్స్ రైలు ప్రమాదానికి గురి అయింది. గుర్తు తెలియని దుండగులు ఇది చేశారని చెబుతున్నప్పట్టికీ, ఇది ఉద్యమం ప్రమాద స్థాయికి వెళుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అవుతుంది. ప్రభుత్వం ఇలాంటి వాటిని అదుపు చేయగలుగుతుందా అన్న సందేహం ఉంది. అందువల్ల వెంటనే తెలంగాణపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడడం లేదు.